Mahesh Babu: బాబులకే బాబు మహేశ్ బాబు..థియేటర్ వద్ద అభిమానుల నినాదాలు..ఎక్కడంటే?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. ఈ సందర్భంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ లో పిక్చర్ ట్రైలర్ చూసి సమ్మర్ బ్లాక్ బాస్టర్ ‘సర్కారు వారి పాట’ అని అంటున్నారు.

‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించింది.థియేటర్ల వద్ద ఈ సినిమా ట్రైలర్ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ లో పిక్చర్ చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. అలా అక్కడ సూపర్ స్టార్ అభిమాన జనసంద్రం ఏర్పడింది.

అక్కడ థియేటర్ బయట అభిమానులు ‘‘పాట పాట.. సర్కారు వారి పాట..’’,‘‘జై బాబు.. జై జై బాబు..’’, ‘‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. మహేశ్ బాబు సూపర్ స్టార్..’’ అని నినాదాలు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది బాగా వైరలవుతోంది. ఈ వీడియో చూసి మహేశ్ – కృష్ణ అభిమానులు సంబురపడుతున్నారు. వచ్చే నెల 12న ‘సర్కారు వారి పాట’ సినిమా జాతర షురూ అవుతుందని అంటున్నారు అభిమానులు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సినిమా చూసేందుకు ఫ్యాన్స్, సినీలవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news