భారత జట్టు సొంత గడ్డ మీద దక్షిణాఫ్రికాతో ఐదు టి20 ల సిరీస్ కు ఉమ్రాన్ మాలిక్ టీమిండియాలో ఎంపికైన అప్పటినుంచి చర్చనీయాంశంగా మారారు. కాగా మొదటి టి-20లో అతడికి అవకాశం దక్కలేదు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు నెట్స్ లో శ్రమిస్తున్న ఉమ్రాన్ మాలిక్.. ప్రాక్టీస్ సెషన్లో గంటకు 163.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
సౌతాఫ్రికాతో జరిగే సిరీస్లో ఉమ్రాన్ ఇంతే స్పీడ్ తో బంతిని విసిరితే మాత్రం పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయం. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచ కప్ లో ఉమ్రాన్ మాలిక్ ని టీమిండియాలో చేసుకోకూడదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ ఇంకా నేర్చుకోవాలని, ప్రస్తుతం టీ 20 జట్టు లో అవకాశం ఇవ్వకూడదని రవిశాస్త్రి సూచించాడు.
” మాలిక్ ను టీంతో తీసుకెళ్లండి.. కానీ అప్పుడే అవకాశాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేర్చుకునేందుకు ఎంతో అవకాశం ఉంది. ఉమ్రాన్ కు వన్డేలు లేదా టెస్టులో ఆడే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత అతని ప్రదర్శనను భవిష్యత్తు నిర్ణయిస్తుంది.” అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.