పాములు నిజంగానే పగబడతాయా..? నాగస్వరం విని నాట్యం చేయడం బూటకమేనా..?

-

మనకు హాని కలిగించే కీటకాల్లో పాములు కూడా ఒకటి.. వీటిని చూస్తే ఎంతవారికైనా ముందు భయం వేస్తుంది.. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అయితే పరిగెడతాం..లేదా ఎదురుతిరుగుతాం.. దాన్ని చంపేస్తాం. పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పగబట్టాయంటే.. మీ పని అయిపోతుందని మన పెద్దోళ్లు చెబుతుంటారు. అలాగే.. నాగ స్వరానికి ల‌య‌బ‌ద్దంగా నాట్యం చేస్తాయ‌ని మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. శ‌బ్ధానికి అనుగుణంగా పాములు నాట్యం చేయ‌డాన్ని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. కానీ ఇది అంతా అబ‌ద్ధమ‌ని నిపుణులు అంటున్నారు. పాములు నాగ‌స్వ‌రాన్ని విన‌లేవ‌ని, అస‌లు పాముల‌కు బాహ్య చెవులు, క‌ర్ణ‌భేరి ఉండ‌వట.. ఏదేదో ఇంట్రస్టింగ్‌ ఉంది కదా..! అసలు మ్యాటర్‌ ఏంటంటే..

పాము అసలు నాగస్వరం వినబడదా..?

పాము లోప‌లి చెవి చ‌ర్మానికి అనుసంధానమై ఉంటుంది. భూమి మీద వ‌చ్చే కంప‌నాల‌ను చ‌ర్మానికి, లోప‌లి చెవికి అనుసంధాన‌మైన క‌ర్ణ‌స్థంభిక గ్ర‌హించి ఆ త‌రంగాల‌ను పాము లోప‌లి చెవికి అంద‌వేస్తుంది. ఈ విధంగా మాత్ర‌మే పాము శ‌బ్దాల‌ను గ్ర‌హిస్తుంది.. గాలి ద్వారా వ‌చ్చే శ‌బ్ధ త‌రంగాల‌ను పాము విన‌లేదు. అయితే పాము శ‌బ్ధానికి అనుగుణంగా నాట్యం ఎలా చేస్తుందంటే.. పాము ముందు నాగ‌స్వ‌రం ఊదే వ్య‌క్తి ముందుగా పాము బుట్ట మీద కొడ‌తాడు. ఆ కంప‌నాల‌ను గ్ర‌హించిన పాము లేచి ప‌గ‌డ విప్పుతుంది. పాము అలా ప‌డ‌గ విప్ప‌గానే నాగ‌స్వ‌రం ఊదే వ్య‌క్తి బూర‌ను అటూ ఇటూ క‌దిలిస్తూ ఊదుతాడు. మీరు మళ్లీ ఓ సారి సీన్‌ రివైజ్‌ చేసుకోండి.. ఆ బూర‌ను కాటు వేయాల‌నే ఉద్దేశ్యంతో బూరను ఎటు వైపు తిప్పితే అటు వైపు పాము కూడా ప‌డ‌గ‌ను తిప్పుతుంది. అంతేకానీ ఆ వ్య‌క్తి ఊదే నాగ‌స్వ‌రానికి అనుగుణంగా పాము నాట్యం చేయ‌దట. బూర‌కు బ‌దులుగా ఏదైనా వ‌స్తువును క‌దిలించిన కూడా పాము అదేవిధంగా ప‌డ‌గ‌ను ఆడిస్తుంది.

పాము పగబట్టటా..?

అలాగే పాము ప‌గ‌బ‌ట్టి కాటు వేస్తుంద‌ని మ‌నం బలంగా నమ్ముతున్నాం.. అస‌లు పాముల‌కు క‌ళ్లు కూడా స‌రిగ్గా ప‌ని చేయ‌వట. ఎదుటి వ్య‌క్తుల‌ను, వ‌స్తువుల‌ను అవి స‌రిగ్గా చూడ‌లేవు. త‌న సంతానాన్ని కూడా పాము గుర్తించ‌లేదు. పామును దూరంగా ఒక చోట వ‌దిలిస్తే అది అక్క‌డే తిరుగుతూ ఉంటుంది కానీ పాము త‌న స్థానానికి చేరుకోలేదట. అలాంటిది పాము ప‌గ‌బ‌డుతుంది అనుకోవ‌డం అపోహ మాత్ర‌మే అని నిపుణులు చెబుతున్నారు. అయితే సంప్రదాయాలను సైన్స్‌ను మనం కలిపి చూడలేం.. ఎవరి విశ్వాసం వాళ్లది.. అసలు జరిగేది మాత్రం ఇది..!

Read more RELATED
Recommended to you

Latest news