అన్నం తింటే.. బరువు పెరిగిపోతారా..?

-

చాలామంది రోజు అన్నం తింటూ ఉంటారు. అన్నం తింటే బరువు పెరిగిపోతారు అని అంటూ ఉంటారు. నిజంగా అన్నం తింటే బరువు పెరిగిపోతారా..? బరువు తగ్గేందుకు అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టేస్తే ఉపయోగం లేదని నిపుణులు అంటున్నారు. చాలామంది బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు అన్నం తినడం మానేస్తారు. పూర్తిగా అన్నం తినడం మానేసి మిగిలిన ఆహార పదార్థాలను తింటుంటారు.

నిజానికి అన్నం మన సంస్కృతిలో భాగం అన్నం తినడం వలన కడుపు నిండిన భావం మనకి కలుగుతూ ఉంటుంది అన్నం పూర్తిగా మానేయడం వలన చర్మం జుట్టు జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కనుక అన్నం మానేయడం మంచిది కాదు స్థానికంగా దొరికే ఏ బియ్యం అయినా కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తున్నాయి పూర్వికులు నుండి ఎలాంటి ఆహారపు అలవాట్లు వచ్చాయో అవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే.

రాత్రిపూట తక్కువ తినడం ఉదయం పూట ఎక్కువ తినడం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అన్నంతో పాటుగా కూర పప్పు ఇవన్నీ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు బరువు తగ్గాలనుకుంటే లైట్గా తీసుకోవాలి తప్ప పూర్తిగా అన్నం మానేయడం వలన బరువు తగ్గొచ్చు అనేది నిజం కాదు ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వాళ్ళు కచ్చితంగా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు కూరగాయలు ఆకుకూరలు వంటివి కచ్చితంగా తీసుకోవాలి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news