రెండు పాన్ కార్డులు వచ్చాయా..? అయితే ఇలా చెయ్యండి లేదంటే జరిమానా తప్పదు..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చెయ్యడానికి అవసరం అవుతుంది. అలానే బ్యాంక్ లేదా ఇతర ట్రాన్సక్షన్స్ కి కూడా అవసరం. ఇదిలా ఉంటే ఒక్కోసారి ఏం అవుతుందంటే పొరపాటుగా మనకి రెండు పాన్ కార్డ్స్ వచ్చేయడం జరుగుతుంది. మీకు కూడా పొరపాటున రెండు కార్డులు వచ్చాయా..? అయితే ఇలా చెయ్యండి.

మాములుగా పాన్ కార్డులు సరైన గుర్తింపు మరియు డీటెయిల్స్ ని బట్టీ ఇస్తుంటారు. అయితే రెండు కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లు చాలా మంది కంప్లైంట్ చేసారు. మీకు అలా ఉంటే వాటిని సరెండర్ చెయ్యాలి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇలా రెండింటిలోనూ మనం సరెండర్ చేయవచ్చు.

ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఆరు నెలలు శిక్ష మరియు కనీసం 10 వేల రూపాయల జరిమానా పడుతుంది. మీ వార్డు అధికారితో అపాయింట్‌మెంట్ ని తీసుకొని సబ్మిట్ చెయ్యచ్చు. ఆదాయపు పన్ను శాఖ సైట్‌ నుండి వార్డు తెలుసుకోవచ్చు. ఒక నెల రోజులు పాటు ప్రాసెస్ జరుగుతుంది. ఆదాయపు పన్ను శాఖ సైట్‌ చూసి స్టేటస్ తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news