ఎక్కువగా పన్నీర్ ని తింటున్నారా..? అయితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత..!

-

చాలామంది పన్నీరుని ఇష్టపడతారు. మనం పన్నీరు తో ఎన్నో రకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. పనీర్ ని లిమిట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ పరిమితికి మించి తింటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి చాలా మంది పన్నీరు వల్ల చాలా లాభాలు ఉన్నాయని భావించి అధికంగా తీసుకుంటూ ఉంటారు కానీ అతిగా పన్నీరు తినడం వల్ల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.

 

పన్నీర్ వలన చక్కటి ప్రయోజనం పొందవచ్చు. మంచి రుచితో పాటు గా ప్రోటీన్ కూడా మనకి అందుతుంది. పన్నీర్ ను తీసుకోవడం వల్ల క్యాల్షియం కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుంటే వాటిని లిమిట్ గా తీసుకోవాలి లిమిట్ దాటితే ముప్పు తప్పదు.

కొలెస్ట్రాల్ పెరుగుతుంది:

ఎక్కువగా పన్నీర్ ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి పోతుంది అలాగే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా ఇది పెంచుతుంది.

గుండె సమస్యలు వస్తాయి:

పన్నీర్ ను అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య కలిగి గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది.

జీర్ణ సమస్యలు తప్పవు:

అధికంగా పన్నీర్ ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, కడుపు నొప్పి వంటివి కలుగుతాయి. ఎందుకంటే పన్నీరు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అందుకనే ఈ సమస్యలు కలగొచ్చు.

ఫుడ్ పాయిజనింగ్:

పన్నీర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య కూడా రావచ్చు. ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా వచ్చేవాళ్ళు పన్నీర్ కి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమస్య మరింత ఎక్కువ అవ్వచ్చు.

బరువు పెరిగిపోవడం:

అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు దీన్ని ఎక్కువ తీసుకోకూడదు. దీని వల్ల మరింత బరువు పెరిగిపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news