బంగ్లాదేశ్‌లో లాంచ్‌ అయిన Tecno Pova 4 Pro స్మార్ట్‌ ఫోన్..

-

టెక్నో పోవా 4 ప్రో స్మార్ట్ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. పోవా సిరీస్‌ నుంచి వచ్చిన లేటెస్ట్‌ ఫోన్‌ ఇదే..దీని కాస్ట్‌ అటు బడ్జెట్‌లోనూ లేదు.. అలా అనీ మరీ అంత ఖరీదు కూడా కాదు..మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. కేవలం ఒక్క వేరియంట్‌లోనే ఫోన్‌ లాంచ్‌ అయింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

టెక్నో పోవా 4 ప్రో ధర..

ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 26,990 బంగ్లాదేశ్ టాకాలుగా మనదేశ కరెన్సీలో సుమారు రూ.21,330) నిర్ణయించారు.
ఫ్లోరైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

టెక్నో పోవా 4 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇది గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ కాబట్టి ఇందులో 5 జీబీ వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌ను వర్యువల్‌గా అందించనున్నారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.
45W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 24 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ ప్రకటించింది.
గేమింగ్ ఓరియంటెడ్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

టెక్నో ఫోన్స్‌కు ఇండియన్‌ మార్కెట్‌లో డిమాండ్‌ బానే ఉంది. ఇవే ఫీచర్స్‌తో ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ అయితే పోటీ తట్టుకుని నిలబడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news