వర్షాకాలంలో ఎక్కువగా ఉడకపెట్టిన వాటిని తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాటిలో వేరుశనగలు, అనపకాయలు, మొక్కజొన్నలు వాటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మొక్కజొన్నలను ఈ వర్షాకాలంలో ఎలా తినకూడదో తెలుసుకుందాం.
మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా రుచికరమైనవిగా ఉంటాయి.అయితే వీటిని సరిగ్గా తినకపోతే మాత్రం చాలా ప్రమాదంగా మారుతుందని నిపుణులు తెలియజేస్తున్నాను. మొక్కజొన్నను పచ్చిగా తిన్నా లేదా సరిగ్గా నమలలేకపోయినా కూడా చాలా నష్టం వాటిల్లుతుందట. ముఖ్యంగా చిన్నపిల్లలు మొక్కజొన్నలు తినేటప్పుడు సరిగ్గా నమిలి తినడం చాలా మంచిది. లేకపోతే దీనివల్ల జీర్ణం కాకుండా పలు సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
మొక్కజొన్నలను బాగా ఉడకపెట్టి ఉప్పు, కారం, నిమ్మరసం కలిపి తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ వీటిని సరిగ్గా ఉడికించకపోతే ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా జీర్ణం కావడం కూడా చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో కడుపులో మనకి అల్సర్, గ్యాస్ ట్రబుల్, లూజ్ మోషన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయట.
మొక్కజొన్నలను సరిగ్గా ఉడికించకపోతే వాటిని తినడం వల్ల మలబద్ధక సమస్యలు, డయేరియా వంటివి వస్తాయి. ముఖ్యంగా మనం మొక్కజొన్నలను కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని బయటికి తీసి తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా మొక్కజొన్నలను పచ్చివి లేదా సరిగ్గా ఉడకని తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మొక్కజొన్నను ప్రతిరోజు తినడం వల్ల బరువును కూడా తగ్గించవచ్చు.
మొక్కజొన్నలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫాస్ఫరస్, నియోసిస్, విటమిన్ b6 వంటివి పుష్కలంగా లభిస్తాయి ముఖ్యంగా మొక్కజొన్న పిండిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి షుగర్ బారిన పడినవారు వీటిని బాగా తినడం వల్ల మంచి జరుగుతుంది. ఇక అంతే కాకుండా వీటిని పాప్ కార్న్ లాగా చేసుకొని తినవచ్చు.