తెలంగాణలో కట్టప్పలు ఏం పీకలేరు : సీఎం కేసీఆర్‌

-

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కట్టప్పలు, ఏక్‌ నాథ్‌ షిండేలు ఏం పీకలేరని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌. అసలు కట్టప్ప కథలో…అసలు బాహుబలికే పట్టాభిషేకం అయిందని.. చురకలు అంటించారు. నిన్న ప్రగతి భవన్‌ లో సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ… దమ్ముంటే ఏక్ నాథ్ షిండే లాంటి వాన్ని తెలంగాణలో తీసుకు రా మోడీ అంటూ సవాల్‌ విసిరారు సీఎం కేసీఆర్‌.

నీ ఉడత ఊపులకు ఎవరు భయపడరంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఏక్‌నాథ్‌ షిండే తరహాలో ఆనాడు కాంగ్రెస్ కూడా ఎన్టీ రామారావుపై నాదెండ్ల భాస్కర్‌ను ప్రయోగించిందని కేసీఆర్ తెలిపారు.తర్వాత ప్రజలే తిరగబడి మళ్లీ ఎన్టీఆర్‌ను తెచ్చుకున్నారని గుర్తు చేశారు.

నరేంద్ర మోదీకి దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేలను తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. 75 ఏళ్ల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటకు రావాలన్న కేసీఆర్‌.. అప్పుడే దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయన్నారు. అంతేకాకుండా.. అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలంటూ మరోసారి రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news