జిమ్‌ చేసిన తర్వాత సలాడ్స్‌ తింటున్నారా..? అయితే లాభం లేదు..!

-

ఫిట్‌గా ఉండాలని చాలామంది జిమ్‌లకు వెళ్లి చెమటలు చిందిస్తారు. బరవు తగ్గడానికి నాన తంటాలు పడతారు. బరువు తగ్గాలంటే.. కేవలం వర్కౌట్స్‌ చేస్తే సరిపోదు.. డైట్‌ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిమ్‌లో నానా కష్టపడి ఇంటికి వచ్చి.. పూరీలు, వడలు, దోశలు అంటూ ఫుల్‌గా లాగిస్తే..కథ మళ్లీ మామూలే కదా..! జిమ్‌ చేసిన తర్వాత ఏం తింటున్నారన్నది చాలా ఇంపార్టెంట్‌. ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ జిమ్‌ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయేవి తినొద్దని చెప్తున్నారు. అవేంటంటే..

ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, వర్కౌట్ తర్వాత ఏవైనా కచ్చితంగా తినాలి. దీని వల్ల మీ కండరాలకి చాలా మంచిది. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఆ సమయంలో తినకపోవడమే మంచిది. అవి..

స్పోర్ట్స్ డ్రింక్..

చాలా మంది వర్కౌట్ తర్వాత స్పోర్ట్స్ డ్రింక్ తాగుతుంటారు. అయితే నిపుణులు ఏమంటున్నారంటే.. మీరు గంట నుంచి గంటన్నర లోపు వర్కౌట్ చేస్తే స్పోర్ట్స్ డ్రింక్ తాగాల్సిన అవసరం లేదు. హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలట… దీంతో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ని తిరిగి పొందుతాం. చాలావరకూ స్పోర్ట్స్ డ్రింక్స్ అన్నీ ప్రాసెస్ చేసిన షుగర్ కంటెంట్‌తో ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

సలాడ్..

జిమ్ చేశాక సలాడ్ తినడం అంత మంచిది కాదు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణమవ్వడానికి శక్తి ఎక్కువ అవసరమవుతుందట.. వర్కౌట్ తర్వాత జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఈ కారణంగా అది జీర్ణమవ్వదు. దీని బదులు అరటిపండ్లు, ప్రోటీన్‌ పౌడర్ స్మూతీస్ తాగడం, పిండి పదార్థాలు, ప్రోటీన్ ఫుడ్ తినడం మేలు.

నీరు..

చాలా మంది వర్కౌట్ తర్వాత నీరు తాగరు. కానీ, నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్కౌట్ టైమ్‌లో చెమట ద్వారా ద్రవాలు కోల్పోతారు. వీటిని మేనేజ్ చేయాలంటే కచ్చితంగా 2 కప్పుల నీరు తాగాలట.

కార్బోహైడ్రేట్స్..

వర్కౌట్ తర్వాత ప్రోటీన్ మాత్రమే కాదు, కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ముఖ్యం. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. వర్కౌట్ తర్వాత ప్రోటీన్, పిండి పదార్థాల మజిల్ పవర్‌కి చాలా ముఖ్యం.

అసలు ఏమి తినకుంటే…

ఎక్సర్‌సైజ్ తర్వాత ఏవైనా తినడం చాలా ముఖ్యం. కొంత మంది ఏమి తినరు. ఇది అస్సలు మంచిది కాదు. తినడం వల్ల మీ శరీరంలో హార్మోన్ల ఒత్తిడి దూరమవుతుంది. దీంతో మీ రక్తంలో చక్కెర బ్యాలెన్స్ అవుతుంది. ఏమి తినకుంటే.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news