మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా…? అయితే ఇది మీకు శుభవార్త…!

-

తాజాగా బ్యాంకుల్లో వరుస పెట్టి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నారు. కాబట్టి బ్యాంక్ కస్టమర్లు ఈ లాభాన్ని వినియోగించుకోవచ్చు. కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ జాబితా లోకి వచ్చి చేరాయి. రుణాలు రేట్లు బాగా తగ్గించడం వల్ల కస్టమర్లకు చాలా ప్రయోజనం. అయితే ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

money
money

తాము కూడా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించింది. ఎంసీఎల్ఆర్ లో 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపు నిర్ణయంతో బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారికి చాలా ప్రయోజనం ఉంది. అలానే రుణ రేట్లు కూడా తగ్గాయి. జులై 11 నుంచి బ్యాంక్ రేట్ల కోత నిర్ణయం అమలు లోకి వస్తుంది. కాబట్టి రేపటి నుంచి మీ కొత్త రేట్లు వర్తిస్తాయి.

అయితే మరిన్ని వివరాలకు వెళ్తే ఈ బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు ఇప్పుడు 7.4 శాతానికి వచ్చింది. అదే గతంలో ఈ రేటు 7.6 శాతం గా ఉండేది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.6 శాతానికి ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.25 శాతానికి క్షీణించాయి. అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించడం ఇది 13వ సారి. ఇకపోతే దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటివలే ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news