కొందరికి నడుం నొప్పి ఎక్కువగా ఉంటుంది నడుం నొప్పితో బాధపడే వాళ్ళు ఈ విషయాన్ని కచ్చితంగా పాటించండి. ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఆచరిస్తే నడుము నొప్పి బాధనుండి బయటపడడానికి అవుతుంది. ఒత్తిడి, కాల్షియం కొరత, బలహీనత, అనారోగ్య సమస్యలు వంటి కారణాల వలన నడుం నొప్పి వస్తుంది. కండరాలు బాగా అలసిపోవడం, ప్రయాణాలు చేయడం, బండి నడపడం, ముందుకు వంగి పనులు చేసుకోవడం వలన నడుం నొప్పి వస్తుంది. నడవాలి అన్నా కూర్చోవాలన్నా ఏదైనా చిన్న పని చేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది.
నడుం నొప్పి వలన డైలీ రొటీన్ దెబ్బ తినకుండా ఉండాలంటే కచ్చితంగా నడుం నొప్పి ఎందుకు వస్తుందో, నడుం నొప్పి రాకుండా ఏం చేయాలో చూసుకోండి. వెన్నునొప్పి ఉన్నవాళ్లు లేవడం కదలడం కష్టం కానీ యోగ చేయడం వలన కొంచెం ఉపశమనాన్ని పొందొచ్చు. వ్యాయామం చేస్తే మెదడు నాచురల్ పెయిన్ కిల్లర్ అయిన ఎండోర్ఫిన్ ని రిలీజ్ చేస్తుంది.
బిగుతుగా మారిన కండరాలని రిలాక్స్ చేస్తుంది. హాట్, కోల్డ్ కంప్రెసర్లని ప్రయత్నం చేయండి. అప్పుడు నడుం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నడుం నొప్పితో బాధపడే వాళ్ళు ఒత్తిడిని తగ్గించుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. ఎండోర్ఫైన్ లో ఉత్పత్తిని పెంచితే నడుం నొప్పి బాధనుండి బయటపడొచ్చు. విచారం ఉద్రిక్తత ఆందోళనని కూడా ఈ హార్మోన్ దూరం చేస్తుంది నడుం నొప్పి తగ్గడానికి సరైన నిద్ర భంగిమ కూడా అవసరం. ఏ పనులు చేయడం వలన నడుం నొప్పి వస్తుందో వాటికి దూరంగా ఉంటే కూడా నడుం నొప్పి నుండి బయట పడొచ్చు.