గద్ద జీవితం గురించి మీకు తెలుసా..? 5 నెలల పాటు అలా చేసి పునర్జన్మ ఎత్తుతుంది..!

-

పక్షుల్లో గద్ద ఒక ప్రత్యేకమైన పక్షి.. గద్ద అంటే అందరూ అశుభం అనుకుంటారు.. పక్షులకే రాజు గద్ద..దీని జీవితం గురించి చాలా మందికి తెలియదు. మిగతా పక్షులకంటే గద్ద జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. గ‌ద్ద త‌న దృష్టికి ఉన్న శ‌క్తితో మేఘాలపై నుంచి కూడా భూమిపై త‌న ల‌క్ష్యాన్ని చూడ‌గ‌ల‌దు. అంత‌టి శ‌క్తి గ‌ద్ద చూపుకు ఉంటుంది. వివిధ ర‌కాల ఆకారాల్లో చాలా చురుకుగా గ‌ద్ద ఆకాశంలో ఎగురుతుంది. గ‌ద్ద‌ గురించి మ‌నం చెప్పుకోవ‌ల‌సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం కూడా ఉంది. అదే గ‌ద్ద పున‌ర్జ‌న్మ‌. గ‌ద్ద‌కు పున‌ర్జ‌న్మ ఏంట్రా అనుకుంటున్నారా..? గ‌ద్ద పున‌ర్జ‌న్మ గురించి తెలుసుకోవాలంటే గ‌ద్ద జ‌న్మ ర‌హ‌స్యం గురించి తెలుసుకోవాల్సిందే.

గ‌ద్ద సుమారు 70 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జీవించ‌గ‌ల‌దట. గ‌ద్ద‌కు 30 నుండి 40 సంవ‌త్స‌రాల వ‌య‌సు రాగానే అది క్రమంగా బ‌ల‌హీన ప‌డ‌డం మొద‌ల‌వుతుంది. ఈ స‌మ‌యంలోనే గ‌ద్ద పంజాలు బ‌ల‌హీన ప‌డి వేటాడ‌డానికి స‌హ‌క‌రించవట. ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవ‌డానికి ఇబ్బంది అవుతుంది. రెక్క‌లు బాగా పెరిగి స‌రిగ్గా ఎగ‌ర‌లేదు. అంటే ఓ రకంగా ముసల్ది అయిపోయి ఏ పని చేయలేదనమాట. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో గ‌ద్ద ముందు రెండే ఆప్షన్స్‌ ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఇదే శ‌రీరంతో ఆహారం లేక మ‌ర‌ణించ‌డం.. లేక కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డ‌మా.. కానీ గ‌ద్ద మాత్రం రెండో దారిని ఎంచుకుని పున‌ర్జ‌న్మ ఎత్త‌డానికి సిద్ధ‌మ‌వుతుందట..

క‌ఠోర శ్ర‌మ‌తో త‌న‌ను తాను మార్చుకోవ‌డానికి సిద్ద‌మైన గ‌ద్ద ఒక ఎత్తైన ప‌ర్వ‌తానికి చేరుకుంటుంది. అక్క‌డ తాత్కాలికంగా నివాసాన్ని ఏర్ప‌రుచుకుంటుంది. ముందుగా ఆహారం తీసుకోవ‌డానికి వీలు లేకుండా పెరిగిన త‌న ముక్కును బండ‌రాయికి పొడుచుకోవ‌డం ప్రారంభిస్తుందట.. నొప్పి పెడుతున్న‌ప్ప‌టికీ పెరిగిన ముక్కును అర‌గ‌దీస్తుంది… అలాగే గుబురుగా పెరిగి ఎగ‌ర‌డానికి స‌హ‌క‌రించ‌ని త‌న‌ రెక్క‌ల‌ను ఒక్కొక్క‌టిగా తానే తొల‌గించుకుంటుంది. ఇక చివ‌ర‌గా త‌న పంజాల‌ను బండ‌రాయికి వేసి కొడుతూ విర‌గ్గొట్టుకుని కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. ఇలా 150 రోజుల పాటు శ్ర‌మించిన త‌రువాత గ‌ద్ద కొత్త రెక్క‌ల‌తో, కొత్త ముక్కుతో, కొత్త పంజాతో న‌వ య‌వ్వ‌నంగా నూత‌నోత్తేజంతో కొండ శిఖ‌రంపై ఎగురుతుంది. ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా బ‌త‌కాల‌నే సంక‌ల్పంతో 5 నెల‌ల పాటు త‌న‌ను తాను కొత్త‌గా మార్చుకున్న గ‌ద్ద మిగ‌తా 30 సంవ‌త్స‌రాల పాటు హాయిగా జీవిస్తుందట.. భలే ఉంది కదా..!

Read more RELATED
Recommended to you

Latest news