వంకాయలు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో మీకు తెలుసా..?

-

వంకాయ వంటి కూర … శంకరుని వంటి దైవం లేడని అంటారు. నోరూరించే రుచితో పాటు అనేక మెరుగైన లాభాలు వంకాయలో దాగి ఉన్నాయి. అన్ని కూరగాయలలో వంకాయ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. వంకాయను రారాజు అని కూడా పిలుస్తుంటారు. తెలుగు వారి శుభకార్యాలలో వంకాయలను ఎక్కువగా వాడుతుంటారు. అలానే తెలుగు వారింట వంకాయ లేని పండుగలే ఉండవు.వంకాయను ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.ఇందులో పోషకాలు, విటమిన్స్, ఫైబర్,మినరల్స్ పుస్కలంగా ఉంటాయి.

వంకాయను వారానికి ఒక్కసారైనా డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఎంతో మేలును చేస్తుంది.వంకాయ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె శరీరంలోని బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.

వంకాయలో క్యాలరీస్ అస్సలు ఉండవు. కనుక బరువు తగ్గాలనుకునే వారికి వంకాయలు తమ డైట్లో చేర్చుకోవడం వల్ల అసలు బరువు పెరగరు. అలానే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది.
షుగర్ వ్యాధితో బాధపడే వారికి వంకాయ అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఫైబర్ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు.

అంతేకాకుండా వయస్సు పైబడే లక్షణాలను తగ్గిస్తుంది.శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.అలానే నరాలకు సంబందించిన వ్యాధులను దూరంగా ఉంచుంతాయి.వంకాయలలో విటమిన్లు మరియు మినరల్స్,నీరు ఉండటం వలన జుట్టుకు లోతుగా పోషణ అందుతుంది.జుట్టు పల్చబడడం, చిట్లడం, రాలడం వంటి సమస్యలను నివారించి, లంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది .వంకాయలో బి కాంప్లెక్స్ విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడికి గురి చేసే కణాలను నివారిస్తాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news