మద్యం తాగేవారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని తెలిసినప్పటికీ దానిని తాగకుండా ఎవరు ఊరుకోరు. నేటి కాలంలో స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 31.2% మంది మద్యం తాగుతున్నట్లుగా జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో 0.2 శాతం మహిళలకు మద్యం తాగే అలవాటు ఉందని స్పష్టం చేశారు. రోజుకు 50 లక్షల మంది మద్యం తాగుతున్నారు.

కోటి మందికి పైగా వారానికి ఒకసారి మాత్రమే మద్యం సేవిస్తున్నారు. మరి కొంత మంది సగటున నెలకు 11 క్వార్టర్లు తాగుతున్నారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా 17.2% మహిళలు మద్యం తాగుతున్నట్లుగా సర్వేలో వెళ్లడైంది. అంటే స్త్రీలు కూడా మద్యం ఎక్కువగానే సేవిస్తున్నారని నివేదికలో వెల్లడైంది.