ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని పెద్దలు అంటూంటారు. ఉల్లిపాయ తనలో అద్బుత గుణాలను దాచుకొని ఉంది. వంటకాలకు అదనపు రుచిని ఇవ్వడంతో పాటు, శరీరానికి ఎంతో మేలునూ చేస్తుంది. ఉల్లిపాయ తక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంది. క్యాన్సర్ ను నిరోధిస్తుంది.చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈరోజుల్లో పురుషులు మరియు స్త్రీలు మానసిక మరియు శారీరక సమస్యల కారణంగా శృంగారంలో భాగస్వాముని సంతృప్తి పరచడంలో విఫలం అవుతున్నారు.
రతి క్రీడలో లైంగిక సామర్థ్యాన్ని ప్రదర్శించలేక చతికిలపడుతున్నారు.అయితే శృంగారరేచ్చని పెంచే ఆహార పదార్థాలలో ఉల్లిపాయ ముందు వరుసలో ఉంటుంది. ఉల్లిపాయలు వేగవంతమైన మరియు సహజవంతమైన లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉల్లిపాయలు రోజువారీ ఆహారంలో ఉపయోగించడం వలన తగ్గిపోయిన లైంగిక శక్తిని తిరిగి పొందవచ్చును. శీగ్ర స్థలనం మరియు రతిలో ఎక్కువసేపు పాల్గొన్న లేకపోవడం లైంగిక సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించ లేకపోవడం వంటి శృంగార సమస్యలను ఉల్లిపాయ చెక్ పెడుతుంది. వెన్నలో వేయించిన ఉల్లిపాయలు తినడం ద్వారా సంభోగ శక్తిని పెంచుకోవచ్చు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
ఉల్లిపాయ శరీర ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా రక్షిస్తుంది. అనేక కారణాలు వల్ల జుట్టు బాగా ఊడిపోయే సమస్యలకు ఉల్లిపాయ ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. ఉల్లి రసాన్ని తీసుకొని వెంట్రుకల కుదుల్లా దాకా పట్టించి ఎండనిచ్చి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇది తలలో ఏర్పడే చుండ్రుని కూడా నివారిస్తుంది.ప్రతిరోజు చిన్నపాటి ఉల్లిపాయలను తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడమే కాకుండా గుండెపోటు వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఉల్లిపాయ రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది ఫైబర్ ను పుష్కలంగా కలిగి ఉంది.అందువల్ల మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
మహిళలల ఋతు క్రమ సమయంలో వచ్చే నొప్పులను నివారిస్తుంది .ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంది. నిద్రలేమితే బాధపడేవారు తమ రోజువారి ఆహారంలో ఉల్లిపాయలు ఉపయోగించడం వలన సుఖమైన నిద్రను పొందవచ్చు.