మాస్క్డ్ ఆధార్ కార్డుని ఇలా పొందొచ్చు తెలుసా..?

-

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రభుత్వ స్కీముల మొదలు ఎన్నో వాటికి ఆధార్ కార్డ్ చాలా అవసరం. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా సరే ఆధార్ కార్డు ఉండాలి. అయితే ఈ మధ్య కాలం లో ఆధార్ కార్డు వినియోగదారులు వివిధ రకాల మోసాలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని.. వినియోగదారులకు భద్రత కల్పించాలని యుఐడిఎఐ ఒక నిర్ణయం తీసుకుంది.

 

అదే మాస్క్డ్ ఆధార్ కార్డులను తీసుకు రావడం. ఈ మాస్క్డ్ ఆధార్ కార్డు లో చివరి నాలుగు అంకెల మాత్రమే కనబడతాయి. మొదటి ఎనిమిది అంకెలు కనపడవు. ఇలా కార్డును జారీ చేయడం వల్ల ఆధార్ నంబర్ అపరిచితులకు కనిపించదు దీంతో దుర్వినియోగం అవ్వదు. అయితే మరి మాస్క్డ్ ఆధార్ కార్డ్ ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం.

దీని కోసం మీరు యుఐడిఎఐ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వండి.
ఆ తర్వాత డౌన్ లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి.
మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
నెక్స్ట్ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు మీకు ఓటిపి వస్తుంది.
ఓటిపి ఎంటర్ చేసి డౌన్ లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయండి.
అంతే మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటుంది.
పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు.
డౌన్లోడ్ చేసిన తర్వాత దాని పాస్వర్డ్ మీ ఈమెయిల్ కి వస్తుంది.
ఇలా మీరు ఆధార్ కార్డు ని వాడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news