తాటి బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

-

చాలామందికి తాటి బెల్లం అంటే ఎంతో ఇష్టం తాటి బెల్లం వలన చక్కటి ప్రయోజనాలని పొందచ్చని ఆరోగ్యని నిపుణులు అంటున్నారు. మరి తాటి బెల్లం తీసుకుంటే ఎటువంటి లాభాలను మనం పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో తగినంత ఐరన్ కచ్చితంగా ఉండాలి. ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. ఐరన్ లోపం కనుక ఉంటే నీరసం, తల తిరిగినట్లుగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి కలుగుతాయి.

 

జుట్టు రాలిపోతుంది, డిప్రెషన్ ఉంటుంది, తలనొప్పి, గోర్లు పెళుసుగా మారడం తో పాటు చర్మం పాలిపోయినట్లుగా ఉండడం వంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఐరన్ లోపం లేకుండా చూసుకోండి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.

అయితే ఐరన్ టాబ్లెట్స్ వలన మాత్రమే కాదు మీరు తీసుకునే ఆహారం ద్వారా కూడా ఐరన్ మీకు అందుతుంది అని గుర్తుపెట్టుకోండి. తాటి బెల్లం ద్వారా ఐరన్ ని మీరు పొందవచ్చు దీంతో రక్తహీనత వంటి ఇబ్బందులు ఉండవు. ఐరన్ తో పాటు ఈ ప్రయోజనాలని కూడా మీరు పొందొచ్చు.

ఆహారం బాగా జీర్ణం అవుతుంది:

తాటి బెల్లం తీసుకుంటే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

పోషకాలు ఉంటాయి:

హెమోగ్లోబిన్ స్థాయిని ఇది పెంచుతుంది అలానే మెగ్నీషియం కూడా అందుతుంది నాడీ వ్యవస్థను ఇది నియంత్రిస్తుంది .ఎముకలకి బలాన్ని ఇచ్చే క్యాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ కూడా దీనిలో ఎక్కువగా ఉంటాయి.

క్యాన్సర్ రిస్క్ ఉండదు:

తాటి బెల్లం తింటే క్యాన్సర్ రిస్క్ కూడా ఉండదు.

మలబద్ధకం సమస్య ఉండదు:

తాటి బెల్లం తీసుకుంటే మల బద్ధకం ఇబ్బంది కూడా ఉండదు అలానే తలనొప్పి వంటి ఇబ్బందుల్ని కూడా ఇది తొలగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news