అల్లు అర్జున్ అమితంగా తినే ఆహారం ఏమిటో తెలుసా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కుమారుడు గా అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరో పొజిషన్ లో ఉన్నారు. గంగోత్రి సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. అల్లు అర్జున్ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట. అంతేకాకుండా ఆహారపు నియమాలను అనుసరిస్తూ తన శరీరాన్ని ఫిట్ నెస్ గా ఉండేందుకు కొన్ని నియమ నిబంధనలను కూడా పాటిస్తారు వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

అల్లు అర్జున్ ఉదయం లేవగానే.. ఒక గంట పాటు రన్నింగ్ చేసి ఆ తర్వాత ఒక కప్పు కాఫీ ఒక జ్యూస్ తాగుతారట ఆ తర్వాత 8 గంటలకు మూడు ఆమ్లెట్ వేసుకొని తింటారట. ఇక ఆ తర్వాత ఉదయం 12 గంటల సమయంలో లంచ్ కి ముందు ఒక సూప్, గ్రీన్ సలాడ్ వంటివి తీసుకుంటాడు. అందులో ప్రోటీన్ కోసం చికెన్ ఎగ్ ఉండేలా చూసుకుంటారు.. ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కార్బోహైడ్రేట్లు ఉండేలా ఏవైనా భోజనాలు చేస్తూ ఉంటాడట.

ఇక సాయంత్రం వేళ 5 గంటల మధ్య ఉడకబెట్టిన గింజలను తిన్న తర్వాత ఏదైనా జ్యూస్ తీసుకుంటాడు.. బ్రౌన్ రైస్ తో కలిగిన చికెన్/చేపల డిన్నర్ ను పూర్తి చేస్తాడట. మొత్తంమీద పాలను తన శరీరం ఫిట్నెస్ కోసం వాటిని దూరం పెట్టాడు. అల్లు అర్జున్ ఎక్కువగా చికెన్, చేపల పులుసు తోనే చేసిన వాటిని ఎక్కువగా తింటారట. ఇక అంతే కాకుండా రాగి ముద్ద, నాటుకోడి పులుసు అయితే తెగ ఇష్టపడి తింటారట. ఇక పప్పు లోకి నెయ్యి లేకుండా తినడట అల్లు అర్జున్. ఎక్కువగా సాయంత్రం వేళ మొలకెత్తిన గింజలను తింటూ ఉంటాడట. అయితే ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం చికెన్ తినడం చాలా తగ్గించినట్లు గా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news