వీళ్లు నోరు తెరిచి గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సాధించారు.. ప్రపంచంలోనే పెద్ద నోరున్నది వీరికే..!

-

ఇప్పటి వరకూ మనం ఈ ప్రపంచంలోనే తక్కువ ఎత్తు, బాగా పొడవు, పెద్ద ముక్కు ఉన్న వ్యక్తుల గురించి విని ఉంటాం.. మరీ పెద్ద నోరు ఉండి కూడా ఫేమస్‌ అయిన వాళ్ల గురించి మీరెప్పుడైనా విన్నారా..? పెద్ద నోరు మాములు పెద్ద నోరు కాదు.. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇతని నోరు.. చాలా వెడల్పుగా ఉంటుంది. మనం తినేప్పుడు పెద్దగా ఉన్నవి ఒకేసారి నోట్లు వేసుకోలేం.. పానీపూరీకే ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. కానీ ఒకవేళ ఆ వ్యక్తి పానీపూరి తిన్నాడంటే.. ఒకేసారి నాలుగు ఐదు పూరీలు నోట్లో వేసుకోగలడు..కూల్‌ డ్రింగ్‌ బాటిల్‌ డబ్బానే నోట్లో పెట్టేసుకుంటాడట. అంత పెద్దగా ఉంటుంది ఇతని నోరు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా కథ మనమూ చూద్దామా..!

ఈ వ్యక్తి పేరు ఫ్రాన్సిస్కో డొమింగో జోక్విమ్. ఇతను ఆఫ్రికన్ దేశం అంగోలాకు చెందినవాడు. ఇతను తన నోటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందాడు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నోరు కలిగిన వ్యక్తిగా ప్రజలకు ఈయన బాగా తెలుసు. అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఫ్రాన్సిస్కో నోరు 17 సెంటీమీటర్లు లేదా 6.69 అంగుళాల వరకు తెరుచుకుంటుంది. శీతల పానీయం డబ్బా మొత్తం తన నోటిలో పెట్టుకోగలడు. అతనిలోని ఈ ప్రత్యేక లక్షణం ప్రజలను షాకింగ్‌కు గురిచేస్తుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో ఫ్రాన్సిస్కో తన నోరు తెరవడాన్ని చూడవచ్చు..

ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మహిళ ఎవరూ..

పెద్దనోరు వేసుకుని ఓ అరిచేస్తావ్‌ అని మనం కామన్‌గా లేడీస్‌ను అంటుంటారు.. కానీ ఆమె నోరు నిజంగానే విపరీతమైన పొడవండీ.. ఆమె పేరు.. సమంతా రామ్‌డెల్…అమెరికాకు చెందిన సమంతా రామ్‌డెల్ అతిపెద్ద నోరు కలిగిన మహిళగా పేరు ఉంది . 32 ఏళ్ల సమంత 6.52 సెంటీమీటర్ల వరకు నోరు తెరవగలదు. ఆమె ఒక్కసారిగా బర్గర్ తినగలదచ. ఈ పెద్ద నోరు కారణంగా, సమంతా పేరు 2021 సంవత్సరంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. మొత్తానికి అలా సమ్‌థింగ్‌ స్పెషల్‌తో వాళ్లు ఫేమస్‌ అయిపోయారు.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news