దేశంలో అత్యధిక సంఖ్యలో బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా..? ఆంధ్రాలోనూ ఎక్కువే

-

ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడితే చాలు.. పదుల సంఖ్యలో యాచకులు వస్తారు. గుడి మెట్లమీద, బ్రిడ్జిల పక్కన, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ బిచ్చగాళ్లు ఉంటారు. దయతలచి ఇచ్చే ఒక్క రూపాయి కూడా వారికి మాహా భాగ్యం. ఇండియాలో ఎంత మంది బెగ్గర్స్ ఉంటారో కదా..? మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది యాచకులు ఉన్నారో తెలుసా..?

Two beggars with green card, MBA degree picked by Hyderabad police ahead of Ivanka Trump's visit - BusinessToday

భారతదేశంలో ఎక్కువ మంది యాచకులు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో మొత్తం యాచకుల సంఖ్య ఎంత అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం 2021లో ఓ నివేదిక తయారు చేయించింది. దేశంలో దాదాపు 4 లక్షల మంది యాచకులు ఉన్నారు. 2 లక్షలకు పైగా పురుషులు ఉండగా వారితో సరిసమానంగా మహిళా యాచకులున్నారని తేలింది.

బిక్షాటన చేసుకునే వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే లెక్క రెండేళ్ల క్రితం సంగతి. అంటే బెగ్గర్స్ సంఖ్య ఇప్పుడు కచ్చితంగా పెరిగుతుంది. అప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటేనే పశ్చిమ బెంగాల్‌లో 81 వేల మందికి పైగా యాచకులు ఉన్నారు.

దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 65,000 మందికి పైగా యాచకులు ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యాచకులు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 30,218 మంది, బీహార్‌లో 29,723 మంది, మధ్యప్రదేశ్‌లో 28,695 మంది, రాజస్థాన్‌లో 25,853 మంది యాచకులు ఉన్నారు. కర్ణాటకలో దాదాపు 10682 మంది ఉన్నారు.

ఇలా భిక్షాటన చేస్తున్న చాలా మందిలో చిన్నారులు, వృద్ధులు ఆసరా లేకుండా వీధిన పడి అడుక్కుంటున్నారు. దేశంలో బెగ్గింగ్‌కు ఒక మాఫియా కూడా ఉంది తెలుసా.? యాచక మాఫియా వల్ల చాలా మంది అనాథలు భిక్షాటన చేసే స్థాయికి దిగజారుతున్నారు.బెగ్గింగ్ మాఫియాపై గతంలో చాలా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. భిక్షాటన చేసి కోట్లు సంపాదించిన వారూ ఉన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో ఓ బిచ్చగాడు కోటి రూపాయలు సంపాదించి సంచలనం సృష్టించాడు. ఆయన ఇంటిపైనా ఐటీ సోదాలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news