ఇంట్లో నెమలి పించం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

-

నెమలి అంటే అందరికి ఇష్టమే.. దాని అందం, డ్యాన్స్ ప్రతి ఒక్కరికి ఆకర్షిస్తుంది..నెమలి ఈకలను చాలా మంది పుస్తకాలలో లేదా ఇంట్లో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.చాలామంది ఆ నెమలి ఈకలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు. చూడడానికి కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేసే నెమలిపించం చాలా పవిత్రమైనదిగా కూడా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. నెమలి కొంచం ఒక పక్షి ఈక అయినప్పటికీ ఈక మన రోజువారి జీవితంలో చాలా సమస్యలను పోగొడుతుంది అని మన పండితులు చెబుతున్నారు.కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే నెమలి పించం

ఆ సంబంధాన్ని తిరిగి కలుపుతుందట. అదే విధంగా పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా వారికి నెమలి పించం వస్తే చాలు వారిలో మార్పులు వచ్చేస్తాయి అని అంటున్నారు. మరి నెమలి పించాన్ని ఉపయోగించడం వల్ల ఇంకా ఏఏ భాగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని ఇబ్బందులే ఉంటాయి. ఇటువంటివారు రాత్రి పడుకునే సమయంలో నెమలి పించంను తలగడ కింద పెట్టుకొని పడుకోవడం వల్ల ఆ పించం వ్యతిరేక ప్రభావాన్ని దూరం చేస్తుందట..

అంతేకాదు గ్రహాలు కలిసి రాకుంటే ఎవరికైనా కష్టాలు తప్పవు. అటువంటి వారు ఇంట్లో బెడ్ రూమ్ లో తూర్పు వైపున లేదా ఈశాన్య మూలలో నెమలి ఈకలు ఉంచితే అవి పనులు వేగంగా జరిగేలా చేస్తుంది. అయితే చాలామంది చిన్న పిల్లలకు నెమలి ఈకలు ఇస్తుంటారు. ఇది చాలా మంచి పద్ధతి అని పుస్తకాల్లో నెమలి పింఛం ఉండటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని, చదువులో వెనుకబడిన చిన్నారులు కూడా బాగా చదవగలుగుతారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.వాస్తు దోషాన్ని కూడా పోగుడుతుందట. ఇంటి గేటు ముందు వినాయక విగ్రహంతో పాటుగా నెమలి ఈకను ఉంచితే వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్న నెగటివ్ ఎనర్జీని నుంచి ఇంటిని కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news