పెళ్ళికి ముందు ఈ పరీక్షలు ఎందుకు చేయించుకోవాలో తెలుసా?

-

మన దేశంలో వివాహ వ్యవస్థ చాలా గొప్పది.అంతేకాదు పవిత్రమైనది. పెళ్ళి అంటే నూరేళ్ళ పంట.. ఒకసారి చేసుకుంటే నూరేళ్లు ఆ బంధం బలంగా ఉంటుంది. అందుకే పెళ్లైన జంట వైవాహిక జీవితం సంతోషంగా గడిచిపోవాలని అందరూ కోరుకుంటారు. అయితే మీరు కూడా వివాహానికి సిద్ధమవు తున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోండి. ఇది వివాహానంతరం వచ్చే సమస్యలని పరిష్కరిస్తుంది. మీకు పుట్టబోయే పిల్లలను జన్యుపరమైన వ్యాధుల నుంచి కూడా రక్షించవచ్చు.

*. పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిల జాతకాలను చూస్తారు. అంతేకాదు వారి చదువులని కూడా చెక్ చేస్తారు. కానీ వైద్య పరీక్షలు మాత్రం చేయించరు. నిజానికి ఫెర్టిలిటి టెస్ట్‌ చేయడం వల్ల దంపతుల్లో సంతానానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది. దీనివల్ల సరైన సమయంలో చికిత్స తీసుకోవచ్చు..ఇది ప్రతి జంట ముఖ్యంగా చెయ్యాల్సిన పని.

*. ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా గుండె జబ్బులు సర్వసాధారణమైపోయాయి. అందువల్ల దంపతులు ఒకరికొకరు కుటుంబ వైద్య చరిత్రను తెలుసుకుంటే మంచిది. భవిష్యత్తులో ఈ వ్యాధులకు చికిత్స చేయవచ్చు.

*. కొన్నిసార్లు పిల్లల లో పుట్టుకతోనే వ్యాధులు సంభవిస్తాయి. అందులో ఒకటి తలసేమియా వ్యాధి. అందుకే పెళ్లికి ముందు తప్పనిసరిగా తలసేమియా పరీక్షలు చేసుకోవాలి..ఇది మర్చిపోతే మాత్రం చాలా సమస్యలు రావడం పక్కా అని నిపుణులు అంటున్నారు.

*. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చేయాల్సిన పని ఇది. HIV, STD పరీక్ష చేయించుకోవాలి. సురక్షితమైన సెక్స్‌కు ఇది చాలా ముఖ్యం. మీరు పెళ్లికి సిద్ధమవుతున్నట్లయితే ఖచ్చితంగా సెరాలజీ స్క్రీనింగ్ చేయించుకోవాలి..

*. వివాహానికి ముందు ఏదైనా మానసిక వ్యాధితో బాధపడుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేదంటే వివాహం తర్వాత వారి బంధం నిలవదు.. ఎప్పుడూ ఏదొక సమస్యలు వస్తాయి..ఈ పరీక్షలు పెళ్లికి ముందు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news