రంజాన్ ఉపవాసాన్ని ఖర్జురం తో ఎందుకు విరమిస్తారో తెలుసా?

-

ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే..ఉగాది తర్వాత ఈ మాసం ప్రారంభం అయ్యింది. ముస్లీంలు పాటించే ఉపవాసాన్ని ‘రోజా’ అంటారు. ఈ నెలలో, ముస్లిం ప్రజలు ఉదయం సెహ్రీ సమయంలో ఆహారం తీసుకున్న తర్వాత రోజంతా ఆకలితో, దాహంతో ఉంటారు..సాయంత్రం ఆజా అయ్యాక దీక్షను విరమిస్తారు.ఉపవాసం విరమించే సమయంలో ముస్లీం సోదరులు కొన్ని ఆచారాలు కూడా పాటిస్తారు. ఖర్జూరం తినడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమిస్తారు.

ఆ తర్వాత ఇతర ఏ పదార్థాలైన తింటారు. ఖర్జూరం తిన్న తర్వాతే ఎందుకు రోజా విరమిస్తారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. ఖార్జురాలు చాలా మంచివి.. త్వరగా శక్తిని ఇస్తాయి.. అందుకే ఉపవాసం తర్వాత అందుకే ముస్లింలు వాటితో విరమిస్తారు. ఖర్జూరం ఇఫ్తార్ సమయంలో తిన్న ఇతర పదార్థాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఖర్జూరం తినడం ద్వారానే శరీరానికి ఒక రోజుకు అవసరమైన పీచుపదార్థాలు లభిస్తాయి.

వీటిలో అధిక సంఖ్యలో ఫైబర్స్ మాత్రమే కాదు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఖర్జూరంలో అవసరమైన పోషకాలు ఉన్నందున, ప్రజలు రంజాన్‌లో ఖర్జూరాలను తినడం ద్వారా మంచి శక్తితో పాటు పోషకాలు కూడా అందుతాయి.. ఇది తిన్నాక వేరే వాటిని తీసుకోవడం మంచిది.. గ్యాస్ సమస్యలు కూడా రావని నిపుణులు అంటున్నారు.. రక్తం శుద్ధి అవ్వాలన్నా, ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.. చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా తినడం అలవాటు చేసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news