రామ్ చరణ్ “గేమ్ చేంజర్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

-

దక్షిణాది హిట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిలో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వ ఉద్యోగి అని టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని టాక్.

అయితే తాజాగా నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ మూవీకి “గేమ్ చేంజర్” అనే టైటిల్ ని ఖరారు చేశారు. కాసేపటి క్రితమే ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news