స్వీట్స్ అంటే ఇష్టమా..? అయితే కష్టమే..!

-

చాలా మంది స్వీట్లను ఎక్కువగా ఇష్ట పడుతూ ఉంటారు స్వీట్ ని చూస్తే అస్సలు నోటిని కంట్రోల్ చేసుకోలేరు. మీరు కూడా ఎక్కువగా స్వీట్లు ని తింటూ ఉంటారా..? స్వీట్లు లేకపోతే బతకడం కష్టం అని మీకు అనిపిస్తూ ఉంటుందా అయితే కచ్చితంగా స్వీట్ల వల్ల కలిగే నష్టాలు తీసుకోవాలి.

స్వీట్లు తినడం వల్ల కొన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. అలానే పేస్ట్రీలు, ఐస్ క్రీములు వంటివి అసలు రాత్రి పూట తీసుకోకండి. అయితే స్వీట్స్ ని ఎక్కువగా తీసుకుంటే ఈ ఇబ్బందులు పక్కా వస్తాయి, మరి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఇప్పుడే చూసేద్దాం.

స్వీట్స్ ని ఎక్కువగా తీసుకుంటే లెవెల్స్ పెరుగుతాయి. ఇది స్ట్రెస్ హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి దీంతో నిద్ర కూడా పట్టదు.
రాత్రిపూట ఎక్కువ స్వీట్లు తింటే నిద్రలేమి సమస్య కూడా వస్తుంది.
ఉదయాన్నే పరగడుపున స్వీట్స్ ని తీసుకుంటే కూడా మంచిది కాదు ఉదయాన్నే పరగడుపున స్వీట్స్ ని తింటే నీరసంగా ఉంటుంది అలానే ఏ పని చేయాలనిపించదు.
స్వీట్స్ ని ఎక్కువగా తీసుకుంటే ఫ్యాట్ పెరుగుతుంది ఇలా మీరు బరువు పెరిగిపోతారు కూడా.
అధిక బరువు వలన హృదయ సమస్యలు, హైపర్ టెన్షన్ వంటివి వస్తాయి. స్వీట్స్ ఎక్కువ తింటే పింపుల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే యాక్ని సమస్య ఎక్కువ అవుతుంది అని తెలుస్తోంది.
అంతే కాక స్వీట్స్ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి స్కిన్ కూడా పాడవుతుంది. ఇలా ఎన్నో సమస్యలు స్వీట్స్ ని ఎక్కువ తీసుకోవడం వలన వస్తుంటాయి. కనుక ఈ తప్పులను చెయ్యకండి.

Read more RELATED
Recommended to you

Latest news