TigerNageswaraRao : రవితేజ కోసం రంగంలోకి చిరంజీవి

-

మాస్ మ‌హా రాజ రవితేజ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే…. రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు. 1970లో స్టూవ‌ర్టుపురంలోని టైగ‌ర్ నాగేశ్వ‌రరావు అనే ఒక దొంగ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమాను వంశీ తెర‌కెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నుపుర్ స‌న‌న్ ను హీరోయిన్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసింది. నుపుర్ స‌న‌న్ సింగ‌ర్ గా బాలీవుడ్ కు పరిచయం అయింది.

కృతి స‌న‌న్ సోద‌రియే.. నుపుర్ స‌న‌న్. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ మెగా స్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా జరుగనుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఎప్పుడు ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం అవుతుందో మాత్రం చెప్పలేదు. త్వరలోనే ప్రకటన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news