కరోనా వైరస్ కట్టడి చేయటానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ముప్పు తిప్పలు పడుతున్నాయి. ప్రపంచంలోనే ధనిక దేశాలు, అగ్రరాజ్యాలు అనిపించుకునే దేశాలు కరోనా నీ ఎదుర్కోవటానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఇటువంటి టైం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కరోనా వైరస్ విషయంలో తీసి పారేసే విధంగా చాలా ఈజీగా తీసుకోవడాన్ని వైద్యులు తప్పుబడుతున్నారు.ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడితే జనాల్లో ఇప్పటికే కరోనా వైరస్ అంటే భయం లేదు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రాణాంతకమైన కరోనా వైరస్ ని జ్వరంతో పోలిస్తే ఇంకా లెక్క చేయరు అని వైద్యులు అంటున్నారు. వైరస్ వచ్చిన ప్రారంభంలో కూడా పారాసెట్మోల్, బ్లీచింగ్ పౌడర్ అని సీఎం జగన్ అనటంతోనే లాక్ డౌన్ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏపీ ప్రజలు తిరిగారు. అందువల్లే కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగి పోయాయి అని అంటున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఊహించని విధంగా చాలా ప్రమాదకరంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ విధంగా మరో రెండు వారాలు ఉంటే రాష్ట్రంలో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.