ఫ్యాక్ట్ చెక్: ఫ్లష్ చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందా…? దీనిలో నిజమెంత…?

-

కరోనా వైరస్ అందర్నీ భయపెడుతోంది. ఎప్పుడు ఎలా వస్తుందని అందరూ భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి రోజుకి 4 లక్షలు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలా కరోనా వైరస్ కు సంబంధించిన అనేక విషయాలు మనం సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్లో చూస్తున్నాం. కరోనా వైరస్ సులువుగా టాయిలెట్ లో ఫ్లష్ చేయడం వల్ల వస్తుందా..? మరి ఇందులో నిజమెంతో చూద్దాం..

తాజాగా జర్నల్ ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొనడం జరిగింది. టాయిలెట్ ఫ్లష్ చేసేటప్పుడు దానిలో ఉండే పార్టికల్స్ 40 నుండి 60 శాతం టాయిలెట్ సీట్ మీద పడతాయి. ఫ్లష్ చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని ఎగిరి పడుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే వైరస్ కి గురైన వారు టాయిలెట్ ని ఉపయోగించినప్పుడు టాయిలెట్ బౌల్లో వైరస్లు ఉంటాయి. చెప్పాలంటే టాయిలెట్లు వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

టాయిలెట్ ని సరిగ్గా ఉపయోగించకపోతే వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ శాతం ఉంది. పబ్లిక్
టాయిలెట్స్ లాంటివి ఎక్కువ ఉపయోగించినప్పుడు ఇన్ఫెక్షన్స్ సులువుగా సోకుతాయి.

డాక్టర్లు ఏం చెప్తున్నారు…?

టాయిలెట్ ఫ్లష్ ద్వారా కరోనా వైరస్ సోకుతుంద..?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో చాలా మంది పేషెంట్లు ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ని ఫేస్ చేస్తున్నారు. టాయిలెట్ ద్వారా కూడా వైరస్ విడుదల అవుతుంది కాబట్టి ఈ విషయాలను చూస్తే టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు సులువుగా వైరస్లు సోకుతాయి.

టాయిలెట్ ని షేర్ చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎంత మంది రిస్క్ లో వుంటారా ?

ఒకే టాయిలెట్ ని అందరూ ఉపయోగించడం మంచిది కాదు. ఒకవేళ కనుక పేషెంట్ హోమ్ ఐసోలేషన్ లో ఉంటే వేరేగా వాష్ రూమ్ ఉన్నప్పుడు మాత్రమే ఉండటం మంచిది.

లేదంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా రిస్క్ లో ఉంటారు. ఏదిఏమైనా టాయిలెట్ ని షేర్ చేసుకోవడం మంచిది కాదు. ఒకవేళ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని ఉపయోగించండి. ఫ్లష్ చేసే ముందు టాయిలెట్ సీట్ ని కిందకి పెట్టి ఆ తర్వాత ఫ్లష్ చేయాలి.

స్టడీ ప్రకారం టాయిలెట్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుందా.. ఇందులో నిజమెంత…?

అవును ఇది నిజం దీని ద్వారా కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించండి.

Read more RELATED
Recommended to you

Latest news