నిమిషానికి గుండె 150 పైనే కొట్టుకుంటుందా..? సమస్య ఇదే.. సొల్యూషన్ ఇలా..

-

మన శరీరంలో గుండె ఆరోగ్యాన్ని బట్టే మన ఆయుర్థాయం, మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుంది. బాడీలో పార్ట్స్ అన్నీ రెస్ట్ తీసుకుంటాయి..అలా గుండె కూడా రెస్ట్ తీసుకుంటే..మనం రెస్ట్ ఇన్ పీస్ కు వెళ్లిపోతాం అనుకుంటారు. కానీ గుండె విశ్రాంతి తీసుకుంటుంది తెలుసా..?

గుండె రెస్ట్ తీసుకుంటూనే పనిచేస్తుంది.. అయితే అది గంటలో, నిమిషాలో, సెకండ్లో కాదు.. మిల్లీ సెకండ్స్. 60 సెకండ్లలో 72 సార్లు కొట్టుకుంటుంది… అంటే ఒకసారి కొట్టుకోడానికి పట్టే టైం(0.8) 80 మిల్లీ సెకండ్లు. ఇందులో గుండెపనిచేసేది 0.4 సెకండ్లే. సగభాగం పనిచేసి సగభాగం రెస్ట్ తీసుకుంటుంది. అంటే లబ్ డప్ రెస్ట్ ..ఇలా తీసుకుంటే గుండె లైఫ్ 150 ఏళ్లు. ప్రతి బీట్ కు రెస్ట్ లభించాలి.. అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొందరికి ఉన్నట్టుండి వేగం రెస్ట్ లో ఉన్నా150, 170, 200సార్లు ఒక నిమిషానికి కొట్టుకుంటుంది.

అంటే ఒవర్ టైం డ్యూట్ చేసినట్లే. అసలు 72 ఎక్కడా- 170, 200 ఎక్కడా.. అంత ఎక్కువ సార్లు కొట్టుకుంటే రెండుమూడు రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. కొందరికి 200 పైనే ఉంటుంది. దీన్ని సుప్రావెట్రికులర్ టెకికార్డియా ( Supraventricular Tachycardia SVT) అంటారు. గుండె కొట్టుకోవాలంటే.. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వస్తాయి. ఈ SVT ఉన్నవారిలో 200సార్లు కరెంటు వచ్చి 200సార్లు కొట్టుకుంటుంది. ఇలా కరెంటు ఎక్కువ రావడం అనేది అనారోగ్య లక్షణం. మరికొందరు గుం‍డె 30-40 సార్లే కొట్టుకుంటుంది. అది మంచిది కాదు. అందుకే వారికి పేస్ మేకర్( Pacemaker) పెట్టి దాని ద్వారా కరెంట్ సప్లై చేసి గుండె కొట్టుకునేలా చేస్తారు.

SVT సమస్య దేని వల్ల వస్తుంది.?

హెరిడిటిరీ గా కొంతమందికి వస్తుంది.

స్ట్రస్ వల్ల కూడా కొందరికి ఈ సమస్య వస్తుంది.

విశ్రాంతి సరిగ్గా లేకపోవడం వల్ల

కొన్ని రకాల గుండె సమస్యల వల్ల వస్తుంది.

బాగా వర్కౌట్ చేయడం వల్ల కూడా వస్తుంది.

ధైరాయిడ్ డిసీస్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువ కెఫిన్ ఉన్నవి తీసుకోవడం..కాఫీలు, టీలు తాగడం..ఇది ఎక్కువ మందిలో జరుగుతుంది.

ఆల్కాహాలు , స్మోకింగ్ బాగా తాగడం

బాగా గురక పెట్టి నిద్రపోవడం.. అలాంటప్పుడు గుండెకు ఆక్సీజన్ అందక అలా జరుగుతుంది.

ఇలాంటిన్నీ గుండె వేగం పెరగడానికి కారణాలు అవుతాయి.

లక్షణాలు ఎలా ఉంటాయి.?

చెస్ట్ పెయిన్, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె అదరడం తెలుస్తుంది.

సమస్యను తగ్గించుకోవడం ఎలా.?

బాగా ఎక్కవ గంటలు నిద్రపోవాలి. కనీసం 8-9 గంటలు నిద్రపోవాలి.

కాఫీని మానేసేయాలి.

ఓవర్ వెయిట్ ఉన్నవారు బరువు తగ్గడం స్టాట్ చేయాలి.

ఏరోబిక్, ప్రాణామాయం చేయాలి.

ఇక డైట్ విషయానికి వస్తే తక్కువ పిండిపదార్థాలు, హై ఫైబర్ ఉండే డైట్ తీసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ నాచురల్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ జ్యూస్ తీసుకోవడం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు తీసుకోవడం మంచిది. సాయంకాల కొబ్బరినీళ్లు, చెరుకురసం లాంటివి తీసుకోవడం, ఎర్లీ డిన్నర్..నానపెట్టిన డ్రై ఫ్రూట్స్, డ్రైనట్స్ తీసుకుంటే గుండెకు చాలా మంచిది. మధ్యాహ్నం పుల్కా లేదా జొన్నరొట్టే, రాగిరొట్టె తీసుకోవాలి. ఇలాంటివి చేస్తే.. సమస్యను నాచురల్గా తగ్గించుకోవచ్చు. జీనవశైలిలో మార్పులు చేస్తే..గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గుతుంది. అన్ని సార్లు కొట్టుకుంటే.. అసలు ఎన్నాళ్లు పనిచేస్తుందండి. కాబట్టి సమస్య ఉన్నవారు ఈ పద్దతులు పాటించమంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news