జుట్టు బాగుంటే ఆరోగ్యం బాగుంది అనే మాట చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. జుట్టు ఆరోగ్యంగా ఉంటే సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. హెయిర్ ఫాల్ ఉంటే ఏదో అనారోగ్యం అతన్ని వేధిస్తుందని కొందరి నమ్మకం. జట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇందుకు ఒత్తిడి కూడా ఒక కారణమని, అనారోగ్య ఆహార అలవాట్లు, జుట్టుకి వేసుకునే కొన్ని అనవసర రంగులు, ధూమపానం వంటి అలవాట్లు హెయిర్ ఫాల్ కి కారణం.
అయితే యోగా ద్వారా హెయిర్ ఫాల్ ని అరికట్టే అవకాశం ఉంటుంది అనేది కొందరి మాట. సరిగా యోగా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుందని అంటున్నారు వైద్యులు. ప్రతీ రోజు మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తే మన కేశాల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యమైన జుట్టును సొంతం చేసుకోవడమే కాకుండా మొత్తం శరీర వ్యవస్థకు,
శారీరకంగా, మానసికంగా లాభం చేకూరుతుందని సూచిస్తున్నారు వైద్యులు. యోగా వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుందని అంటున్నారు. దాని ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని చెప్తున్నారు. జీర్ణశక్తి పెంపొందుతుందట. అధోముఖ శవాసన, ఉత్తానాసన, వజ్రాసన, ఆపానాసన, పవనముక్తాసన, సర్వాంగాసన, కపాలభాతి ప్రాణాయామం, భస్ర్తిక ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం ఈ ఆసనాలు జుట్టు ఆరోగ్యానికి మంచిదట.