నానబెట్టిన బాదంని తినడానికి ఇష్టపడడం లేదా..? అయితే ఇలా ప్రయత్నం చేయండి..!

-

బాదం లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వలన ఎన్నో రకాల లాభాలను మనం పొందేందుకు అవుతుంది. అయితే చాలా మంది బాదం ని తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు నానబెట్టిన బాదం తినాలని లేక పోవడంతో బాదంని దూరం పెట్టేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు కూడా బాదం ని రోజు తినరు బాదం తినేందుకు కూడా మారాం చేస్తూ ఉంటారు.

అయితే పెద్దలకైనా పిల్లలకైనా బాదంని తినడం కష్టంగా ఉన్నట్లయితే ఈ పద్ధతుల్ని అనుసరించవచ్చు. రాత్రి నానబెట్టి ఉదయాన్నే బాదంని తినడం కష్టంగా ఉండే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. అప్పుడు కచ్చితంగా మీరు తినడానికి ఇష్టపడొచ్చు.

బాదం లో చక్కటి గుణాలు ఉన్నాయి నిజానికి దీనిని పోషక పదార్థాలకు పవర్ హౌస్ అని చెప్పచ్చు. ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మెగ్నీషియం, కాపర్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.

పొడిచేసి తీసుకోండి:

బాదం పొడి చేసి కూడా తీసుకోవచ్చు నానబెట్టిన బాదం తినడానికి మీకు ఇష్టం లేకపోతే పౌడర్ కింద చేసి దానిని తినండి ఈ పౌడర్ ని పాలల్లో వేసి పిల్లలకు ఇవ్వచ్చు.

బాదం ని రోస్ట్ చేయండి:

రోస్ట్ చేసిన బాదం ని కూడా మీరు తీసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ కనుక ఇలా ట్రై చేయండి.

బాదంపాలు:

మీరు బాదం మిల్క్ ని కూడా తయారు చేసుకోవచ్చు. అలానే ఆల్మండ్ బటర్ ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా చాలా సులభమైన ప్రాసెస్.

బాదం పిండి:

బాదం పిండి కింద చేసి మీరు తీసుకోవచ్చు ఇంట్లోనే ఈ పిండి చేసి దీనితో మీరు పాన్ కేక్స్ వంటివి తయారు చేసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news