సోషల్ మీడియాలో షేర్ చేయకూడని కొన్ని ఫోటోలు….

-

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకరి గురించి తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అవతలి వారు ఎలాంటి వారనేది సోషల్ మీడియా ద్వారా ఒక అంచనాకి వస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడమే మంచిది. అలాంటి ముఖ్యమైన ఫోటోలు ఏంటో చూద్దాం.

బోర్డింగ్ పాస్

మీరు రెగ్యులర్ గా గాలిలో ప్రయాణం చేసేవారైతే బోర్డింగ్ పాస్ వంటివి సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం బెటర్. దీనివల్ల హ్యాకర్స్ అనవసరమైన చర్యలకి పాల్పడవచ్చు. అందులో పాసెంజర్ నంబర్ రికార్డు వంటి వాటిని హ్యాక్ చేసి మొత్తం ఫ్లైట్ విషయాలనే తెలుసుకునే అవకాశం ఉంది.

బర్త్ సర్టిఫికేట్

మీకు పాపనో, బాబో పుట్టాడనుకోండి. ఆ విషయం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందంలో మీ పాప ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఫొటోలు షేర్ చేసినా పెద్ద ప్రాబ్లం కాదు గానీ, బర్త్ సర్టిఫికేట్ వంటివి షేర్ చేయకూడదు.

మీ పిల్లలు కాని వారి ఫోటోలు షేర్ చేయవద్దు.

అందంగా నవ్వుతున్న మైనర్ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. మీకూ వారికీ ఎలాంటి సంబంధం లేనపుడు వాటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

డబ్బుకి సంబంధించిన విషయాలు

బ్యాంకు చెక్ గానీ, క్రెడిట్, డెబిడ్ కార్డు వంటివి గానీ, వ్యాలెట్ నిండా డబ్బున్న ఫోటోలు గానీ షేర్ చేయవద్దు.

లాటరీ టికెట్.

లాటరీ తగిలిందని మీకు తెలిస్తే చాలు. అందరికీ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఊరికే వచ్చే డబ్బు అందరికీ కన్ను ఉంటుంది.

కాపీరైట్ కానీ రచనలు

ఎవరో ఏదో చెప్పారని కాపీ రైట్ కాని రచనలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. దీనివల్ల మరొకరు మీ పనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news