పద్మశ్రీ కల్నర్ ఖాజీ జహీర్ గురించి రెండు మాటలు..!

-

కల్నర్ ఖాజీ సాజీద్ ఆలీ జహీర్ కు ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా కల్నల్ ఖాజీ జహీర్ గురించి తెలుసుకుందాం రండి. జహీర్ తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని కొమిల్లా జిల్లాలోని చౌసాయి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని మక్కువ ఎక్కువ. దేశానికి సేవ చేయాలన్నదే ఆయన కల. అందుకే 18 ఏళ్ల వయసులో దేశ సైన్యంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1971లో కాకుల్ మిలిటరీ అకాడమీలో సీనియర్ కాడెట్ గా ఎదిగారు. ఆ తర్వాత అదే ఏడాది పాక్ ఆర్మీ ఆర్టిల్లరీ కార్ప్స్ లో విధులు నిర్వహించారు. అప్పుడే బంగ్లాదేశ్ లో ప్రత్యేక దేశం కోసం పోరాటాలు జరుగుతున్నాయి.

ఆర్మీ ఆకృత్యాలను తట్టుకోలేకే..
స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో పాక్ సైన్యం తూర్పు పాకిస్థానీలపై దురాగతానికి పాల్పడేది. కొన్ని లక్షల మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. పాక్ ఆర్మీ ఆకృత్యాలను తట్టుకోలేక జహీర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుత బంగ్లాదేశ్ నుంచి జమ్ముకశ్మీర్ లోని సరిహద్దు గుండా భారత్ లో ప్రవేశించాడు. ఆ సమయంలో జహీర్ దగ్గర ఉన్నవీ కేవలం రూ.20, ఒంటిపై దుస్తువులు మాత్రమే. పాక్ దురాగతాలను, యుద్ధ ప్రణాళికలను తెలుసుకుని భారత సైన్యాన్ని సంప్రదించాడు.

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి..
పాకిస్థాన్ ఆర్మీ అరాచకాలను తట్టుకోలేక చాలామంది తూర్పు పాకిస్థానీలు భారత్ కు తలివచ్చారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి భారత ప్రభుత్వం 1971లో సాయం చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట సంస్థ ముక్తి వాహినికి ఆయుధాలను కూడా అందించింది. ఈ మేరకు జహీర్ కూడా బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో పాలు పంచుకున్నాడు. ముక్తి వాహనికి సహ కెప్టెన్ గా వ్యవహరించారు. తూర్పు పాకిస్థనీ పౌరులకు సైనిక శిక్షణ ఇచ్చి.. జెడ్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకున్నాడు. భారత ప్రభుత్వం సహాయంతో పాకిస్థాన్ పై యుద్ధం చేసి తూర్పు పాకిస్థాన్ విముక్తికి పాటుపడ్డారు. యుద్ధ అనంతం బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం లభించింది.

ఎన్నో ఇబ్బందులను తట్టుకుని..
కల్నల్ ఖాజీ జహీర్ ఎన్నో ఇబ్బందులు తట్టుకున్నారు. పాక్ దేశం నుంచి పారిపోయి భారత్ కు చేరుకున్నప్పుడు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాక్ ప్రభుత్వం జహీర్ పై అనేక కుట్రలు పన్నింది. ఢాకాలో ఉన్న ఆయన ఇంటికి నిప్పంటించి.. కుటుంబ సభ్యులను తరమికొట్టింది. పాక్ రహస్యాలను, యుద్ధ ప్రణాళికలను చేరవేసినందుకు ఆయనపై డెత్ వారెంట్ ను కూడా జారీ చేసింది. అయినా కల్నల్ జహీర్ అవేవీ పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో కృషి చేశారు. ఈ మేరకు 2013లో బంగ్లా ప్రభుత్వం కల్నల్ జహీర్ కు అత్యున్నత పౌర పురస్కారం ‘ఇండిపెండెన్స్ డే అవార్డు’ను అందించి సత్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news