100 కోట్ల హీరోగా అవతరించిన మాస్ బాస్ రవితేజ..!!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా.నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా విడుదల అయిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రవితేజ కు 100 కోట్ల హీరోగా నిలబడాలనుకున్న తన కల సాకారం అయ్యింది.

 సినిమా 14 రోజులు గడిచినా కూడా ఎక్కడా తగ్గకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఇక 14 రోజులకి అయితే ధమాకా చిత్రం మొత్తం 100 కోట్ల రూపాయల గ్రాస్ సొంతం చేసుకుంది. ఇంకో వారం దాక పెద్ద సినిమాలు లేవు కనుక ఇంకొన్ని రోజులు వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.

దీనితో రవితేజ అభిమానుల సొంతంగా కష్టపడి పైకి వచ్చిన రియల్ హీరో కు అద్బుత విజయం దక్కిందని సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా గెస్ట్ రోల్ కూడా చేసాడు. ధమాకా సినిమా విజయం సాధించడంతో ఆ పాజిటివ్ ఫీలింగ్ కూడా తోడు అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news