రెట్టింపవుతున్న అవ్వా తాతల పెన్షన్ కష్టాలు

-

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో అవ్వా తాతల పెన్షన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ప్రతినెలా ఈ ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్నాయి.పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను కుట్ర ప్రకారం దూరం చేశాక వృద్ధుల వికలాంగుల కష్టాలు రెట్టింపవుతున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేర్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు ఆండ్ బ్యాచ్ ఎప్పటినుండో టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకుని వాలంటీర్ల సేవలను అడ్డుకున్నారు. దీంతో ప్రజలకు పట్టించుకునేవారు కరువయిపోయారు.

ఏపీలో వృద్దులు, వికలాంగులు చంద్రబాబు నాయుడు నిర్వాకంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికే వచ్చి చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టే వాలంటీర్లు ఈ నెల రాలేదు. దీంతో పెన్షన్ డబ్బుల కోసం ఆవ్వాతాతలు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మండుటెండలో, నడవలేని స్థితిలో, బారెడు దూరం క్యూలైన్లలో నిలబడి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. తమ పరిస్థితికి కారణమైన చంద్రబాబును, ప్రతిపక్ష కూటమికి అవ్వాతాతలు శాపనార్ధాలు పెడుతున్నారు.

బ్యాంక్ అకౌంట్ వున్నవారు కష్టమో నష్టమో అనుకుంటూ పెన్షన్ డబ్బులు తెచ్చుకుంటున్నారు. మరి అకౌంట్ లేనివారి పరిస్థితో… వాళ్లు తమ పెన్షన్ డబ్బులు ఎలా పొందాలో కూడా అర్థంకాని పరిస్థితి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ప్రతినెలా పెన్షన్ డబ్బులు వచ్చాయి… ఇప్పుడు మాత్రం డబ్బులు వస్తాయో రావో తెలియని పరిస్థితి. ఇలా తమ చేతికాడికి వచ్చే డబ్బులను లాక్కున్న చంద్రబాబుపై వృద్దుల సీరియస్ అవుతున్నారు

ఈ వయస్సులో వారిని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరసమా చంద్రబాబు అని తిట్టుకుంటున్నారు.ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓటు మాత్రం జగన్ కే వేస్తామని చెప్తున్నారు.వాలంటీర్లు ఉన్నపుడు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని,ఇప్పుడు చంద్రబాబు వల్ల 5km దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుంది ఆవేదన చెందుతున్న అవ్వతాతలు.

Read more RELATED
Recommended to you

Latest news