మనకు బాడీలో ఎక్కడైనా కట్ అయితే.. బ్లడ్ వస్తుంది. మరి చెట్లను కట్ చేస్తే బ్లడ్ వస్తుందా..! కామన్‌గా చెట్లను నిరికితే.. ఏం రాదు.. కానీ ఒక చెట్టును కట్ చేస్తే.. బ్లడ్ వస్తుందట. అదే డ్రాగన్ బ్లడ్ ట్రీ. సైంటిఫిక్ భాషలో దీన్ని డ్రాకనా సిన్నబారీ (Dracaena cinnabari) అంటారు. ఈ చెట్లు అరేబియా సముద్రంలో… యెమెన్ (Yemen) తీరానికి దగ్గర్లో… సొకోత్రా చిన్న దీవుల సముదాయం ఉంది. ఆ దీవుల్లోని ఒక దీవిలో ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్ల లోపల ఎర్రటి గమ్ లాంటిది ఉంటుంది. వీటిని కట్ చేసినప్పుడు.. ఆ గమ్ కారుతుంది. అది చూసేందుకు నెత్తురులా ఉంటుంది. ఇక అది చూసి.. చెట్లు ఏడుస్తాయనీ.. అప్పుడు రక్తం కన్నీరులా కారుతుందని చెప్తుంటారు.
ఈ చెట్టు నుంచి కారే ఎర్రటి గమ్‌ను మందుల తయారీలో వాడుతారు. అలాగే లిప్‌స్టిక్ లాంటి కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌లో కూడా ఉపయోగిస్తాట. వయోలిన్లకు వార్నిష్‌లా కూడా వాడుతున్నారు. ఈ చెట్లు ఒకే దీవిలో ఉన్నప్పటికీ… క్రీస్తు శకం 60 సంవత్సరం ముందు నుంచే వీటితో వ్యాపారం చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ చెట్లు 60 అడుగుల ఎత్తు 20 అడుగులు వెడల్పు పెరగగలవు. ఒక్కో చెట్టూ 650 సంవత్సరాల దాకా పెరుగుతుంది. ఈ చెట్ల కొమ్మలు గుంపులుగా ఒకే చోట ఉంటాయి. అందువల్ల ఈ చెట్లను దూరం నుంచి చూస్తే భారీ పుట్టగొడుగుల్లా కనిపిస్తాయి.
ఈ చెట్లకు బెర్రీస్ కాస్తాయి. వాటికి చాలా విలువ ఉంది. పసువులకు దాణాగా కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు. ఆవులు, మేకల ఆరోగ్యాన్ని పెంచే లక్షణం ఈ బెర్రీస్‌కి ఉందట. అయితే పరిమిత సంఖ్యలోనే ఈ పండ్లను పశువులకు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ వాడితే.. మళ్లీ అనారోగ్యానికి దారితీస్తుందట. ఎన్నో విచిత్ర లక్షణాలు ఉన్న ఈ చెట్లు అంతరించిపోయే చెట్ల జాబితాలో ఉన్నాయి. అయితే.. కొత్తగా పెరిగే ఈ జాతి చెట్లు… గొడుగు ఆకారాన్ని కోల్పోతున్నాయి.
సొకోత్రా దీవుల సముదాయాన్ని యునెస్కో.. ప్రపంచ వారసత్వ సంపదగా 2008లో గుర్తించింది. ప్రస్తుతం ఈ దీవులు ఎండిపోతున్నాయి. అంచనా ప్రకారం 2080 నాటికి ఈ చెట్లు 45 శాతం తగ్గిపోతాయి. వీటిని కాపాడే ప్రయత్నాలు కూడా ఏం జరగటం లేదు. కాబట్టి కొన్నాళ్లకు ఇవి పూర్తిగా అంతరించిపోతాయనే చెప్పాలి.!
ఈ చెట్లు ఆకారంలో అద్భుతం.. ఉపయోగంలో అమోగం కాబట్టి.. వీటిని అంతరించిపోకుండా చూస్తే.. భవిష్యత్తు తరాలకు ఇలాంటి వెరైటీ చెట్లను చూపించిన వాళ్లమవుతాం..!