కేవలం ఇంటి వ్యర్థాలతోనే రూ. 70వేలకు పైగా సంపాదించవచ్చు…!

-

మనకి చెత్త ఎందుకూ పనికి రాదు అని పారేస్తూ వుంటారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు పనికి రాని చెత్తతోనే నిజంగా ఎన్నో అద్భుతాలని చేస్తున్నారు. పైగా అందరికీ అవసరమైన ఆ డబ్బును కూడా వీళ్ళు సంపాదిస్తున్నారు. అదేమిటి చెత్త తో డబ్బులు ఎలా వస్తున్నాయి అని అనుకుంటున్నారా…? అయితే తప్పకుండ మీరు దీనిని చూడాలి.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే… కేవలం మన ఇంటి వ్యర్థాలతోనే రూ. 70వేలకు పైగా సంపాదించవచ్చు. తెలంగాణ లోని ఒక గ్రామం లో వాళ్ళు అంతా అలానే చేస్తున్నారు. తెలంగాణలోని హరిదాస్‌పూర్ గ్రామంలో ప్రజలు చెత్తని తీసుకుని డబ్బు సంపాదిస్తున్నారు. మొదట చెత్తను రీసైక్లింగ్ చేస్తూ వీళ్ళు తమ గ్రామం వెలుపల డంపింగ్ యార్డ్‌ని కూడా నిర్మించారు. వాటే బిజినెస్ ఐడియా కదా…!

ఇక్కడ వాళ్ళు తడి, పొడి చెత్తగా వేరు చేస్తారు. ఆ తరువాత వాటి నుంచి రీ సైక్లింగ్ చేయగలిగే వ్యర్థాలను తీసి పనికి రాణి వాటిని కాల్చేస్తారు. కాల్చాక వచ్చిన బూడిదని కూడా మల్లి ఉపయోగిస్తారు. ఇది ఇలా ఉంటే తడి చెత్తని కుళ్లబెడతారు. అలా కంపోస్ట్ ఎరువును తయారు చేస్తారు. ఆ కంపోస్ట్ ఎరువును రైతులకి ఎక్స్‌పోర్ట్ చేస్తారు.

ఇలా గ్రామ పంచాయతీ రూ. 70వేలు సంపాదిస్తోంది. వీటి ద్వారా వచ్చే డబ్బు తో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆ గ్రామా సర్పంచ్ అన్నారు. ఇప్పటికే సీసీటీవీ కూడా వున్నాయి. గ్రామానికి జి +1 మోడల్‌లో కొత్త పంచాయతీ భవనం కూడా నిర్మిస్తున్నామని, ఈ భవనం మరికొన్ని నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు.

ఏది ఏమైనా చెత్త తో కాసులు వస్తున్నాయి అంటే సూపర్ ఐడియా కదా..! బిజినెస్ చేస్తే మంచి లాభాలు కూడా వస్తాయి. పైగా ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. చెత్త కూడా ఉండకుండా శుభ్రంగా ఉంటుంది. పైగా మన ఇంటి వ్యర్థాలతోనే రూ. 70 వేలకు పైగా సంపాదించవచ్చు అంటే మంచి ఐడియానే.

 

Read more RELATED
Recommended to you

Latest news