ఏపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

-

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో ఈ రోజు ఉదయం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్ స్థానాలకు 7,506 మంది పోటీ చేయగా.. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది పోటీలో నిలబడ్డారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ 88,523 మంది అధికారులు, సిబ్బందిని నియమించింది. కాగా, 3,249 గ్రామ పంచాయతీల్లో 525 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అయితే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవాలు ఎన్నుకున్నారు. కానీ అప్పట్లో ఎన్నికల కమిషనర్ అనుమతించలేదు. సోమవారం సాయంత్రం అనుమతించడంతో ఈ రెండు జిల్లాల్లో కూడా గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

voting
voting

ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ 29,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 1,130 మంది ఎన్నికల అధికారులు, మరో 3,249 మంది స్టేజ్-2 అధికారులు, 1,4322 మంది సహాయ ఎన్నికల అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 44,392 మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. అయితే వీటిలో 3,458 సమస్యాత్మక కేంద్రాలుగా, మరో 3,594 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వీటిల్లో పటిష్ట భద్రతను 3,047 పరిశీలకులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొననున్నారు.

కరోనా బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు..
కరోనా బాధితుల కోసం మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 12.30 గంటల నుంచి 1.30 గంటలకు బాధితులు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కేంద్రాల వద్ద సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను ఎన్నికల కమిషన్ అందించింది. బాధితులు ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో పీపీఈ కిట్లు కూడా ఏర్పాటు చేసింది. ఓటర్లకు థర్మల్ స్కానింగ్ నిర్వహించి.. బాడీ టెంపరేచర్ తక్కువగా ఉంటేనే అనుమతిస్తున్నారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నవాళ్లను వెనక్కి పంపి పోలింగ్ చివరి గంటలోఅనుమతించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news