స్ఫూర్తి: హోమ్ డెకర్ తో రూ.75,000.. హాబీని వ్యాపారంగా ఎలా మార్చేసుకున్నారంటే..?

-

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా టైంపాస్ కి ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. రాయడం, పాటలు పాడడం, పెయింటింగ్ వేయడం లేదంటే హోమ్ డెకర్స్ వంటివి చేయడం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. నిజానికి హాబీని కూడా ఇంట్రెస్ట్ గా చేసుకుంటే వ్యాపారంగా మార్చుకోవచ్చు. ఈ గృహిణి అదే పని చేసింది ఈమె పేరు దీపికా వెలమురుగన్.

వీరిది కోయంబత్తూర్. ముగ్గు పిండితో కోలంస్ వేయడం, చిన్న చిన్న అందమైన ముగ్గులు వేయడం ఇటువంటివన్నీ ఈమె ఖాళీ సమయంలో చేసే వారు. 2019 లో ఈమె ఇంస్టాగ్రామ్ లో ఈమె చేసిన వాటిని అందరికీ చూపించడం మొదలు పెట్టారు. ఫాలోవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఆమె వ్యాపారంగా మార్చుకోవాలని అనుకున్నారు.

చెక్కతో తయారు చేసిన హోమ్ డెకర్స్ మొదలైన సామాన్లను ఈమె అమ్మడం మొదలు పెట్టారు. దానితో పాటుగా ఇంట్లో అలంకరించుకోవడానికి కొన్ని సామాన్లని కూడా ఈమె సేల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఈమె ఇప్పుడు నెలకి 75 వేల రూపాయలని ప్రాఫిట్ గా పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా హాబీస్ ఉంటాయి. వాటిని ఆసక్తికరంగా మార్చుకుంటే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు.

అలా ఈమె క్రమంగా వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. వాల్ హాంగింగ్స్, తలుపులు, చెక్కతో చేసిన సామాన్లు ఇలా చాలా వాటిని ఈమె సేల్ చేస్తున్నారు కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఈమె సప్లై చేస్తున్నారు. ఎప్పుడూ కూడా మనం మనపై తక్కువ అంచనా వేసుకోకూడదు. ఈమెలా హాబీని కూడా మనం వ్యాపారంలో మార్చుకుంటే మంచిగా గృహిణులు డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version