అఫ్గాన్‌, పాకిస్థాన్‌లలో భూకంపం.. కంపించిన ఉత్తరభారతం

-

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్ లలో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం ఆ దేశాల్లోనే కాకుండా చుట్టుపక్కల పలుదేశాలపై ప్రభావం చూపించింది. తుర్క్‌మెనిస్థాన్‌, కజక్‌స్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, చైనా, కిర్గిస్థాన్‌లలోనూ భూమి కంపించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌పై, మన దేశ ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం పడింది.

అఫ్గాన్‌లో భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. భూకంప కేంద్రం ఆ దేశంలోని ఫాయిజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కి.మీ. దూరంలో.. 180 కి.మీ.లోతున ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, లాహోర్‌, పెషావర్‌, ఝీలం, స్వాత్‌ తదితర ప్రాంతాల్లోనూ 6.8 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప సమయంలో పాకిస్థాన్‌లోని రావల్పిండి మార్కెట్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

దిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూ-కశ్మీర్‌, రాజస్థాన్‌లలో అనేకచోట్ల భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. భూమి కంపించడంతో భయపడిన ప్రజలు ఆయా భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. తీవ్రత ఎక్కువగా అనిపించిందనీ, ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని మరికొందరు చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news