బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈసీఐఎల్ లో ఉద్యోగాలు..

-

బీటెక్ విద్యార్థులకు వరుస గుడ్ న్యూస్ లు అందుతున్నాయి..ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో, ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొన్న విప్రో, నిన్న క్యాప్‌జెమినీ లతో పాటు మరి కొన్ని కంపెనిలు ఉద్యొగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇప్పుడు మరో సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎలా అప్లై చేసుకోవాలి..పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈసీఐఎల్ లో ఖాళీలు మరియు అర్హతలు..

మొత్తం 40 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈసీఈ (21), మెకానికల్‌ (10), సీఎస్‌ఈ (9) ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు గేట్‌-2022 వ్యాలిడ్‌ స్కోర్‌ ను కలిగి ఉండాలి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను 2022 గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలోనే రూ. 54,880 వేతనం ఉంటుంది.ఏప్రిల్‌ 23న మొదలైన దరఖాస్తుల స్వీకరణకు మే 14ని చివరి తేదీగా నిర్ణయించారు.పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ పై క్లిక్‌ చేయండి..ఆసక్తి కలిగిన విద్యార్థులు నోటిఫికేషన్ ను పూర్తీగా చదివి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news