టాలీవుడ్ డ్రగ్స్ కేసు : కేసీఆర్ సర్కార్ పై ఈడీ సంచలన వ్యాఖ్యలు !

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేసీఆర్ సర్కార్ పై ఈడీ సంచలన వ్యాఖ్యలు చేసింది. కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినితారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ మండిపడింది. సిని తారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదన్న ఈడీ.. ఇప్పటి వరకు ఆరు లేఖలు వ్రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా అంటుందని అగ్రహించింది.

సినీ తారలు సహా 41 మందిని ఎక్సైజ్ శాఖ విచారించిందన్న ఈడీ.. డిజిటల్ రికార్డ్స్ , వాగ్మూలాలు, కాల్ రికార్డ్స్ ఇవ్వటం లేదని స్పష్టం చేసింది. సిఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ ల పై చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్ వేసినట్లు చెప్పింది. కెల్విన్ కూల్ ప్యాడ్ లోని కాల్ రికార్డ్స్ ఇవ్వడంలేదన్న ఈడీ.. తాము సేకరించిన ఆధారాలు ట్రైల్ కోర్టులో ఉన్నాయన్న ఎక్సైజ్ శాఖ వాదనలో వాస్తవం లేదన్న హైకోర్టులో వెల్లడించింది. 12 కేసుల్లో 23మంది నిందితులున్నా ఐదుగురు వాగ్మూలాలు మాత్రమే ట్రైల్ కోర్టులో లభ్యం అయ్యాయని ఈడీ స్పష్టం చేసింది. ఇక సోమవారం ఈడీ పిటీషన్ పై విచారించనుంది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు

Read more RELATED
Recommended to you

Latest news