పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్…. అవిశ్వాసం ముందు కనిపించకుండా పోయిన 50 మంది మంత్రులు

-

అసలే పీకల్లోలు అప్పులు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ను ఇప్పుడు రాజకీయ సమస్యలు కూడా వేధిస్తున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం ఎదుర్కొంటున్నారు. ఈనెల 28న పాకిస్థాన్ పార్లమెంట్ ముందుకు అవిశ్వాస తీర్మాణం రానుంది. ఈలోపే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని 50 మంది మంత్రులు కనిపించకుండా పోయారు. అయితే వీరంతా అధికార పార్టీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ 50 మందిలో ఫెడరల్, సహాయక, స్టేట్ మంత్రులు ఉన్నారు.

ఇమ్రాన్ ఖాన్ | imran khan
ఇమ్రాన్ ఖాన్ | imran khan

పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది ఉన్న సభలో మెజారిటీ నిరూపించుకోవాలంటే ఇమ్రాన్ ఖాన్ కు 172 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇదిలా ఉంటే కొంత మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్ కు మద్దతును ఉపసంహరించుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి మొత్తం 155 మంది సభ్యులు ఉంటే.. ఇన్నాళ్లు నాలుగు ప్రధాన పార్టీలు పీటిఐకి సపోర్ట్ చేశాయి. అయితే ప్రస్తుతం ఈ నాలుగు పార్టీలు కూడా ఇమ్రాన్ ఖాన్ కు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోవడం దాదాపుగా ఖాయమైంది.

Read more RELATED
Recommended to you

Latest news