ఎడిట్ నోట్: బాబు గారి ఎత్తులు.!

-

అవసరాలకు తగ్గట్టుగా..సమయానికి అనుకూలంగా రాజకీయం చేసి లబ్ది పొందాలని చూసే నేతల్లో టి‌డి‌పి అధినేత చంద్రబాబు ముందు వరుసలో ఉంటారనే చెప్పవచ్చు..అందితే కాళ్ళు..అందకపోతే జుట్టు పట్టుకున్నట్లు బాబు రాజకీయం ఉంటుంది. అదే తరహాలో బాబు గారి రాజకీయం చేస్తారు. దానికి ఉదాహరణ ఇప్పుడు పొత్తులు దిశగా ముందుకెళ్లడం..2018లో కేంద్రంలో బి‌జే‌పితో తెగదెంపులు చేసుకుని…ఆ పార్టీపై ఒంటికాలి మీద వెళ్ళిన విషయం తెలిసిందే. మోదీ, అమిత్ షాలని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి విమర్శలు చేశారు.

కానీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక పరిస్తితి అర్ధమైంది. అప్పటినుంచి బి‌జే‌పికి దగ్గరవ్వడానికి బాబు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోవర్టులని పెట్టుకుని బి‌జే‌పికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. కేంద్రంలోని బి‌జే‌పి..సి‌ఎం జగన్‌కు అనుకూలంగా ఉంది. ఇప్పుడు జగన్‌ని సైడ్ చేసి బి‌జే‌పి మద్ధతు పొందాలని బాబు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పైగా బి‌జే‌పికి అనుకూలంగా మాట్లాడుతూ..మోదీని పొగుడుతున్నారు. అప్పుడు ప్రత్యేక హోదా అంశంలో బి‌జే‌పితో విభేధించామని..అంతే తప్ప వేరే అంశాలు ఏమి లేవని, ఎన్నికల సమయంలో ఎవరితో కలవాలో అప్పుడు చెబుతామని, జగన్‌ని గద్దె దించడానికి పొత్తులు అవసరమని, అవి సమయాన్ని బట్టి చెబుతానని తాజాగా ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో చెప్పుకొచ్చారు. అలాగే జనసేనతో కలిసి పనిచేస్తున్నామనట్లే బాబు క్లారిటీ ఇచ్చారు.

అటు తెలంగాణలో టి‌డి‌పి ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసి కొన్ని ఓట్లు చీల్చి బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం చేయాలనేది బాబు ప్లాన్‌గా ఉంది. ఇక ఇటు ఏపీలో బి‌జే‌పి-జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలనేది బాబు ప్లాన్. ఇలా ఎక్కడకక్కడ సరికొత్త ప్లాన్‌లతో ముందుకెళుతున్నారు. ఈ ఎత్తులు, పొత్తులు బాబు వర్కౌట్ చేస్తే బాగానే ఉంటుంది…లేదంటే 2019 ఎన్నికల ముందు సీన్ రిపీట్ అవుతుంది. దెబ్బకు పాతాళంలోకి వెళ్లడమే.

Read more RELATED
Recommended to you

Latest news