ఎడిట్ నోట్ : త‌ప్పు చేశావు నిహా !

-

రాత్రి వేళ‌ల్లో తిరుగుళ్లేంటి ? ఈ మాట అమ్మాయిల‌ను అడిగి చూడండి నెత్తిన ఒక్క‌టిచ్చి వెళ్తారు. రాత్రి వేళల్లో క‌ట్టు త‌ప్పి తిరిగితే బాధ్య‌త ఎలా అవుతుంది! బాధ్య‌త గ‌ల పౌరులను ఉద్దేశించి మాట్లాడేట‌ప్పుడు బాధ్య‌త ఉన్న మాట‌లే రావాలి. కానీ వ‌స్తున్నాయా ? ఎందుక‌ని రావ‌డం లేదు. మ‌త్తులో తూగే పెద్ద పెద్ద వాళ్ల బిడ్డ‌ల‌కు పాపం ఇవేవీ తెలియ‌డం లేదా ! లేదా ఉద్దేశ పూర్వ‌కంగా వీరిని కొంద‌రు ఇరికిస్తున్నారా? ఈ ప్ర‌శ్న‌ల‌కూ స‌మాధానాలు వెత‌కాలి.

బిడ్డ‌లంతా ఏమ‌యిపోతున్నారు అన్న వేద‌న నుంచి ఈ విషాదంకు కార‌ణం ఒక‌టి వెత‌కండి. నైజీరియ‌న్ల హ‌వాను పోలీసులు అడ్డుకోలేక‌పోతున్నారా లేదా వీరి వెనుక ఇంకెమ‌యినా శ‌క్తులు ఉన్నాయా? అర్ధ రాత్రి పార్టీలు పార్టీలలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన సంద‌ర్భాలూ ఇవ‌న్నీ ఎలా ఉన్నాయి.అనైతికంగా లేవు. ఉన్నా లేక‌పోయినా మా జీవితం మా ఇష్టం అంటే ఏంచేయాలి?
మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సినీ స్టార్లూ వీళ్లంతా అక్క‌డే ఎందుకు ? పండుగ వేళ ప‌బ్బుల గోలేంటి ? ఓహో ! సంస్కృతి నేర్పుతున్నదే ఇదా! ఆధునికం నేర్పుతున్న‌దే ఇదా ?

అస్స‌లు ఈ క‌ల్చ‌ర్ ఇప్ప‌టిది కాదు. ఎప్ప‌టి నుంచో ఉంది. అయినా కూడా ఎవ్వ‌రూ పెద్ద‌గా వీటిని నియంత్రించ‌లేక‌పోతున్నారు.
డ్ర‌గ్స్ ఫ్రీ హైద్రాబాద్ అని పాట‌లు పాడిన రాహుల్ లాంటి వారు నిన్న‌టి వేళ ప‌ట్టుబ‌డ్డారు. అఫ్ కోర్స్ ఆయ‌న వాద‌న మాత్రం చాలా భిన్నంగా ఉంది. నాకే పాపం తెలియ‌దు. న‌న్ను బ‌ద‌నాం చేయొద్దు అని ! విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తా ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డికి వస్తా అని ! బాగుంది వేళ త‌ప్పిన వేళల్లో ప‌బ్బుల్లో ఈ తాగ‌డం ఏంటి ఇది నియ‌మాల‌కు విరుద్ధం కాదా ? కుటుంబంంతో స‌హా వెళ్లి తాగ‌డం ఏంటి తూగ‌డం ఏంటి? ఇవేనా హైద్రాబాద్ న‌గ‌రం నేర్చుకోమంటున్న‌వి ?

Read more RELATED
Recommended to you

Latest news