తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ వల్ల రిస్క్ ఉంది…టీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసి…బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది..ఈ క్రమంలో బీజేపీ నేతలు దూకుడుగా పనిచేస్తూ..పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు…అటు కేంద్ర పెద్దలు కూడా తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ చాలా వరకు పుంజుకుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.
ఇప్పటివరకు ఏ ప్రతిపక్ష పార్టీకి భయపడని కేసీఆర్ ఇప్పుడు బీజేపీ దెబ్బకు కాస్త టెన్షన్ పడుతున్నారు…ఇందులో వాస్తవం ఉంది. బీజేపీ వల్ల ముప్పు ఉంటుందేమో అనే భయం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే తమకు తిరుగులేదని, బీజేపీ ఏం చేయలేదని, మళ్ళీ తమదే అధికారమని చెప్పి కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని క్లియర్‌గా తెలుస్తోంది. పైకి తమకు తిరుగులేదని చెబుతూనే…జాగ్రత్తగా ఉండాలని సొంత పార్టీ నేతలకు చెబుతున్నారు.
దీని బట్టే చెప్పొచ్చు…కేసీఆర్ ఎంత టెన్షన్ పడుతున్నారు అనేది..అధికారం లేకపోతే పరిస్తితి ఏం అవుతుందనే భయం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ సారి మళ్ళీ అధికారంలోకి రావాలని, బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తున్నారు. మామూలుగా అయితే కేసీఆర్ పెద్దగా ఫీల్డ్‌లో తిరగరని, అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు కలిసే సమయం ఇవ్వరని టాక్ ఉంది. కానీ బీజేపీ దెబ్బకు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు…అలాగే ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నారు.
తాజాగా టీఆర్ఎస్ శాసనసభపక్షా సమావేశం ఏర్పాటు చేసి…ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను శాఖ లాంటి కేంద్ర సంస్థలు ఇక మన మీద పడతాయని, ఇబ్బందులు పెట్టాలని చూస్తాయని, ఈడీలు..బీడీలకు భయపడమని అంటూనే.. వాళ్లకు అవకాశం ఇచ్చే పనులు చెయ్యొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వినిపించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్…పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సిట్టింగ్‌లకే సీట్లనేది టీఆర్‌ఎస్ విధానమని, చెడగొట్టుకుంటే ఏమీ చేయలేమని, అంతా ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉందని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా 70 నుంచి 80 సీట్లు మనవే అని, కష్టపడితే 90 సీట్లు వస్తాయని చెప్పారు. “మిమ్మల్నందర్నీ గెలిపించుకునే బాధ్యత నాది అని, అంతా గట్టిగా ఉండాలి. ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగాల్సిన పనిలేదు” అని కేసీఆర్…ఎమ్మెల్యేలకు సూచించారు.
అంటే ఇక్కడ కేసీఆర్ మేకపోతు గాంభీర్యం క్లియర్ గా అర్ధమవుతుంది. ఎమ్మెల్యేలౌ చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది…అందుకే సిట్టింగులకే సీట్లు అని, అలాగే ఎవరు లోగకూడదని అంటున్నారు…అంటే బీజేపీకి లొంగిపోతారనే భయం కనపడుతోంది. గెలిచే సీట్లు ఏమో 70, 80, 90 అని లెక్కలు చెబుతున్నారు. క్లియర్ గా ఏది చెప్పలేని పరిస్తితి కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే కేసీఆర్..పైకి అంతా బాగానే ఉందని చెబుతూనే…లోపల మాత్రం టెన్షన్ పడుతున్నట్లు అర్ధమవుతుంది.