ఎడిట్ నోట్: చిరు ‘దాడి’.!

-

జగన్‌ని గాని, వైసీపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట అంటే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. మామూలు విమర్శలు చేసిన సరే వైసీపీ నేతలు తగ్గేదెలే అన్నట్లు ఉంటారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఏ ఒక్క నాయకుడుని వైసీపీ నేతలు వదలడం లేదు. జగన్‌ని విమర్శిస్తే చాలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి..ఏకిపారేస్తారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ స్థాయిలో టార్గెట్ చేసి వైసీపీ నేతలు తిడతారో చెప్పాల్సిన పని లేదు.

అలాగే బి‌జే‌పి పురందేశ్వరి అయినా, సి‌పి‌ఐ రామకృష్ణా అయినా జగన్‌ని ఒక్క మాట అంటే వదలరు. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చి జగన్‌ని ఒక్క మాట అనలేదు కానీ..ఎన్టీఆర్, చంద్రబాబులని పొగిడారు. ఇక ఆయన్ని వైసీపీ నేతలు ఏ స్థాయిలో తిట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చంద్రబాబు-పవన్‌లు ప్రతిరోజూ జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో వారిని వైసీపీ నేతలు ప్రతిరోజూ విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది.

చిరు ఇంతకాలం..రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ ఇటీవల పవన్ బ్రో సినిమాని టార్గెట్ చేసి వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అందులో మంత్రి అంబటి రాంబాబుని కించపరిచేలా సీన్స్ పెట్టారని ఫైర్ అవుతున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రత్యేక హోదా లాంటి అంశాలు వదిలేసి పిచ్చుకపై బ్రహాస్త్రం అన్నట్లు సినిమాలపై పడతారు ఎందుకని ఏపీ మంత్రులకు చిరు చురకలు అంటించారు.

ఇంకా అంతే వరుసపెట్టి వైసీపీ నేతలు చిరుపై ఎదురుదాడికి దిగారు. ప్రతి పకోడీ గాడు తమ ప్రభుత్వానికి సలహా ఇచ్చే వాడే అంటూ కొడాలి నాని, పరోక్షంగా చిరుపై ఫైర్ అయ్యారు. అసలు మీ తమ్ముడే ఇదంతా స్టార్ట్ చేశాడని మంత్రి అమర్నాథ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి రాష్ట్రానికి ఏం చేశారని, విభజన హామీలపై ఎప్పుడైనా నిలదీశారా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చిరుపై వైసీపీ మాటల దాడి కొనసాగుతుంది. అయితే ప్రజలకు పథకాలు ఇస్తూ ఎంతో మేలు చేస్తున్న జగన్‌ని ఒక్క మాట అంటే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. అందుకే ఇలా వైసీపీ నేతలు ఏ మాత్రం తగ్గడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news