గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్పీఎస్సీ) శుభవార్తం చెప్పింది. గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పింస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు… ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. 1388 గ్రూప్-3 పోస్టులకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అక్టోబర్‌లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్-3 కేటగిరీలో 1,375 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 30న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-3లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జతచేస్తూ ఈ ఏడాది జూన్ నెలలో టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం.. ఇరిగేషన్ విభాగం, ఐ అండ్ కాడ్‌లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జత చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా కలిపిన ఉద్యోగాలతో కలిపితే మొత్తం గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్యం 1388కి పెరిగింది.