గతంలో ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీం పేట గ్రామానికి చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటెల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి.ఈ భూముల వ్యవహారం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో జమున హెచరీస్ కబ్జా చేసిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలంటూ రజక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడికి యత్నించారు.వర్షాకాలం వస్తుంది.. వారం పది రోజుల్లో భూములు అందించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.